E-Paper
Advertisement

Medchal District: శామీర్‌పేట్‌లో పులి సంచారం.. 18 ఏళ్ల యువకుడు అరెస్ట్, ఎందుకంటే?

Medchal District: శామీర్‌పేట్‌లో పులి సంచారం.. 18 ఏళ్ల యువకుడు అరెస్ట్, ఎందుకంటే?
Advertisement

Medchal District: అరచేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత రకరకాలు వినియోగిస్తున్నారు నేటి యువతీయువకులు. డబ్బులు సంపాదించాలని కొందరు, సెలబ్రిటీ కావాలని మరికొందరు ప్లాన్స్ చేస్తున్నారు.   ఇంకొందరు ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మంచి-చెడు రెండూ ఉన్నాయి. తేడా వస్తే కటకటాలు లెక్కించడం ఖాయం. ఓ యువకుడి విషయంలో అదే జరిగింది. అసలు మేటరేంటి?

అటవీ అధికారులకు చిక్కిన శామీర్‌పేట్ చిరుత

Advertisement

బీహార్‌కి చెందిన 18 ఏళ్ల రవీందర్‌కుమార్‌ రకరకాల ప్రయోగాలు చేస్తుంటాడు. చేతిలోకి స్మార్ట్ ఫోన్, ఆ తర్వాత కావాల్సినంత ఏఐ టెక్నాలజీ. ఏఐ ద్వారా చిరుతపులిని రూపొందించాడు.  మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌లోని స్థానిక పెద్ద చెరువు వద్ద చిరుతపులి తిరుగుతోందంటూ ప్రచారం మొదలుపెట్టాడు. అంతేకాదు ఏఐ ద్వారా తయారు చేసిన వీడియోను సోషల్‌ మీడియా షేర్ చేశాడు.

వాట్సాప్‌ గ్రూపుల్లో ఆ వీడియో చూసిన స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.  చీకటిపడితే బయటకు రావాడానికి భయపడేవారు.  ఈ వ్యవహారం చివరకు ఫారెస్టు అధికారుల దృష్టికి వచ్చింది. కొన్నాళ్లుగా ఈ పరిసర ప్రాంతాల్లో అలాంటి ఆనవాళ్లు లేవని,  ఉన్నట్లుండి చిరుత ఇక్కడికి ఎలా వచ్చిందంటూ అటవీ శాఖ అధికారులు శామీర్‌పేట చెరువు పరిసరాలను పరిశీలించారు.

Advertisement

ఓ యువకుడు అరెస్ట్, ఆపై కేసు నమోదు

చిరుతకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. అయితే వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ప్రచారానికి పాల్పడుతున్నది రవీందర్‌కుమార్‌ అని నిర్ధారించారు. లొకేషన్ గుర్తించి అతగాడ్ని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాను రానంటూ మొండికేశాడు. చేసిన తప్పుని అధికారుల ముందు అంగీకరించాడు.

కృత్రిమ మేధస్సుతో చిరుతపులిని సృష్టించి శామీర్‌పేట్‌లో సంచరిస్తున్నట్లు పుకార్లు చేసినట్టు అంగీకరించాడు. అతడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. నాన్న పులి గేమ్ ఆడితే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూపించాడు రవీంద్రకుమార్. యువత తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి పనులకు పాల్పడితే ఇబ్బంది తప్పవు. అందుకు ఎగ్జాంఫుల్ రవీంద్రకుమార్.

ALSO READ:  హైదరాబాద్ లో మరో లిఫ్ట్ ఘటన.. వృద్ధురాలు బలి

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×