E-Paper
Advertisement

Medchal Crime: అన్నంలో విషం పెట్టి చంపి.. భార్య డ్రామాలు

Medchal Crime: అన్నంలో విషం పెట్టి చంపి.. భార్య డ్రామాలు
Advertisement

Medchal Crime : మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది… ఓ భార్య. ఆహారంలో విషం కలిపి భర్తను హతమార్చింది. ఈ నెల 11న ఇంట్లో అశోక్ అనే వ్యక్తి చనిపోయాడు. అయితే అతను గుండెపోటుతో చనిపోయాడని భార్య పూర్ణిమ పోలీసులను నమ్మించింది. కానీ… అశోక్‌పై విష ప్రయోగం జరిగిందని పోస్టుమార్టం రిపోర్ట్‌లో తేలింది. దాంతో పూర్ణిమను అదుపులోకి తీసుకున్నారు… పోలీసులు.

మేడిపల్లి బృందావన్ కాలనీ రోడ్ నెంబర్ 3లో.. అశోక్, పూర్ణిమ దంపతులు నివాసం ఉంటున్నారు. శ్రీ ప్లే స్కూల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ప్లే స్కూల్‌లోనే అశోక్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అయితే అతని మృతిపై అనుమానాలు లేవని… పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో భార్య పూర్ణిమ పేర్కొంది.

Advertisement

సాయంత్రం 6 గంటలకు స్కూల్ అయిపోగానే రెస్ట్ తీసుకోవడానికి అదే బిల్డింగ్ పైకి వెళ్లాడని… భర్తను పిలుచుకురమ్మని తన కొడుకును పంపిస్తే, అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలిసిందని పేర్కొంది. వెంటనే తెలిసిన డాక్టర్ని రప్పించి, మల్కాజిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని… అప్పటికే అశోక్ మరణించినట్లు వైద్యులు చెప్పారని తెలిపింది.

అశోక్ మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని పూర్ణిమ ఫిర్యాదులో తెలపడంతో.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ ఆమెను పట్టించింది. అశోక్‌పై విష ప్రయోగం జరిగిందని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలడంతో… ఆమెపై అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దాంతో భర్తను తానే చంపానని ఒప్పుకుంది.

Advertisement

ALSO READ: Crime News: మతిస్థిమితం లేని తండ్రిని దారుణంగా చంపిన కొడుకు.. అసలు ఎందుకు చంపాడంటే..?

 

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×