E-Paper
Advertisement

Bengaluru Crime: సహజీవనంలో క్రైమ్ సీన్.. రొమాంటిక్ థ్రిల్లర్‌ మాదిరిగా, ప్రియురాల్ని ఏం చేశాడంటే

Bengaluru Crime: సహజీవనంలో క్రైమ్ సీన్.. రొమాంటిక్ థ్రిల్లర్‌ మాదిరిగా, ప్రియురాల్ని ఏం చేశాడంటే
Advertisement

Bengaluru Crime: యువతీ యువకులు ఫ్రెండ్‌షిప్.. ఆపై ప్రేమకు దారితీసేది. ప్రస్తుతం ట్రెండ్ మారి సహజీవనం కాన్సెప్ట్‌లోని యువతీ యువకులు అడుగుపెట్టేశారు. పెద్ద పెద్ద నగరాల్లో యువతీ యువకులు ఒకే రూమ్‌లో ఉంటున్నారు. తాజాగా సహజీవనంలో మొదలైన విభేదాలు చివరకు హత్యలు చేసుకునే స్థాయికి వెళ్లింది. అలాంటి ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.

బెంగుళూరు సిటీలో దారుణం.. సహజీవనంలో క్రైమ్ సీన్

Advertisement

కర్ణాటకలోని హాసన్ జిల్లా సకలేష్‌పూర్ ప్రాంతానికి చెందినవారు. యువతి పేరు అనుషా.. ఆమె వయస్సు దాదాపు 20 ఏళ్లు ఉంచవచ్చు. 27 ఏళ్ల శరత్‌కు ఇన్‌స్టా ద్వారా పరిచయమైంది అనుషా. వారిద్దరు తమతమ సొంత జిల్లాలను వదిలి బెంగుళూరుకు మకాం మార్చారు. శరత్ వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పని చేసేవాడు. యువతి ఇంట్లోనే ఉంటోంది. ఇదంతా ఆరునెలల కిందట మాట.

ప్రస్తుతం బెంగుళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో సహజీవనం చేస్తున్నారు. శనివారం రాత్రి అనుషా-శరత్‌ల మధ్య వ్యక్తిగత విషయాలపై చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. శనివారం రాత్రికి అవి కాస్త తీవ్రరూపం దాల్చింది. పట్టరాని కోపంతో అనుషా గొంతు నులిమి చంపేశాడు శరత్. యువతిని చింపేసిన తర్వాత ఏం చెయ్యాలో తోచక చివరకు జరిగిన ఘటన గురించి తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి చెప్పాడు శరత్.

Advertisement

ప్రియురాల్ని చంపి పరారైన ప్రియుడు, ఎలా చిక్కాడంటే

అతడు లాయర్ స్నేహితుడు. వెంటనే అతడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు నేరుగా శరత్ ఉంటున్న ఇంటికి వచ్చేశారు. అనుషా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి బంధువులకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పారు.

చివరకు శరత్‌ ఫోన్ కాల్ ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణ మొదలుపెట్టారు. వంటగది క్లీనింగ్ విషయంలో ఇరువురు మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. అయితే శరత్-అనూషకు పెళ్లయినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు చెప్పారు.

ALSO READ: ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మందిపై పోలీస్ కేసు!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×