E-Paper
Advertisement

Madhya Pradesh Crime: దేశంలో ఘోరం.. నగ్న వీడియోలతో బెదిరించి.. విద్యార్థినిపై 4 కార్లలో అత్యాచారం

Madhya Pradesh Crime: దేశంలో ఘోరం.. నగ్న వీడియోలతో బెదిరించి.. విద్యార్థినిపై 4 కార్లలో అత్యాచారం
Advertisement

Madhya Pradesh Crime: మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. 11వ తరగతి విద్యార్థినిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నగ్న వీడియోలతో బెదిరించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. అంతటితో ఆగకుండా మతం మారాలని విద్యార్థినిపై ఒత్తిడి చేశారు. యువతి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు.

అసలేం జరిగిందంటే?

భోపాల్ లోని షాపురా ప్రాంతంలో గల ఓ ప్రముఖ పాఠశాలలో బాధిత విద్యార్థిని చదువుకుంటోంది. ఆమెకు ఓ ఫ్రెండ్ ద్వారా తొలుత ఆసఫ్ అలీఖాన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. స్నేహం పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. ఓ రోజు బాధితురాలి వద్దకు కారులో వచ్చిన ఆసఫ్.. తనతో రమ్మని ఆహ్వానించాడు. అనంతరం ఖానుగావ్ లోని ఏకాంత ప్రాంతానికి తీసుకెళ్లి.. కారులనే యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు.

వీడియో తీసి.. బెదిరింపులు

Advertisement

అయితే ఓ ప్లాన్ ప్రకారమే ఆసఫ్ యువతిపై అత్యాచారం చేసినట్లు తేలింది. బాధితురాలిపై అఘాయిత్యం చేస్తుండగా దూరం నుంచి ఆసఫ్ స్నేహితుడు మాజ్ ఖాన్ వీడియో తీశాడు. ఆ వీడియోను అడ్డంపెట్టుకొని బాధితురాలిపై పలుమార్లు ఆసఫ్, మాజ్ ఖాన్ అత్యాచారానికి ఒడిగట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. లైంగికంగా వేధించడంతో పాటు రూ. లక్ష ఇవ్వాలని లేదంటే వీడియోను వైరల్ చేస్తామని కూడా నిందితులు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Street Dog: ఫేమస్ స్ట్రీట్ డాగ్‌ను.. కారుతో తొక్కించిన డ్రైవర్.. పోలీసులు ఏం చేశారంటే?

రెండు సెడాన్లు, ఒక మహీంద్రా థార్..

Advertisement

నిందితులు రెండు సెడాన్లు, ఒక మహీంద్రా థార్ సహా మెుత్తం నాలుగు కార్లలో యువతిపై లైంగిక దాడికి ఒడిగట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఓ దశలో యువతిని తమ మతంలోకి మారాలంటూ నిందితులు బెదిరించారని.. తమ దైవం కోసం ప్రార్థన చేయాలని పట్టుబట్టారని సమాచారం. చివరికి వారి బాధ తట్టుకోలేక బాధిత విద్యార్థిని జరిగినదంతా కుటుంబ సభ్యుల ముందు వెళ్లగక్కింది. దీంతో యువతి ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజాలు బయటపడ్డాయి. ఇద్దరు నిందితులు.. బాధిత విద్యార్థినితో పాటు మరికొందరిని సైతం లక్ష్యంగా చేసుకున్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Karnataka Crime: జ్యోతిష్యుడ్ని నమ్మి.. తల్లిని చంపిన కూతురు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×