BigTV English

Minor girl gangraped in bus: బస్సులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఐదుగురు అరెస్ట్

Minor girl gangraped in bus: బస్సులో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. ఐదుగురు అరెస్ట్

Minor girl gangraped in bus parked at Dehradun: కోల్‌కతాలో 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరుకవ ముందే మరో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లో కదులుతున్న బస్సులో ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డెహ్రాడూన్‌లో అంతరాష్ట్ర బస్ టెర్మినల్ వద్ద ఆగి ఉన్న ఢిల్లీచ డెహ్రాడూన్ బస్సులో 15ఏళ్ల బాలికపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడడ్డారు. ఇందులో ప్రభుత్వ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఉండడం గమనార్హం.


వివరాల ప్రకారం.. ఈనెల 12న అర్ధరాత్రి అంతరాష్ట్ర బస్ టెర్మినల్ 12వ నంబర్ ప్లాట్ ఫాంపై ఓ బాలిక ఒంటరిగా కూర్చుంది. ఈ విషయాన్నికొంతమంది జిల్లా శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందించారు. వెంటనే కమిటీ సభ్యులు ఆ బాలికను బాలనికేతన్ కేంద్రానికి తరలించారు. వివరాలపై ఆరా తీయగా.. ఆ బాలిక బస్సులో జరిగిన సంగతిని బయటపెట్టింది. దీంతో శిశు సంక్షేమ కమిటీ సభ్యురాలు ప్రతిభా జోషి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

రంగంలోకి దిగిన డెహ్రాడూన్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అజయ్ సింగ్ బాధితురాలితో మాట్లాడారు. అనంతరం వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఆ బాలిక స్వస్థలం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ అని చెప్పిందన్నారు. కాగా, మొరాదాబాద్ నుంచి ఢిల్లీకి.. అక్కడినుంచి డెహ్రాడూన్ వచ్చినట్లు విచారణలో తెలిపింది. అయితే బస్సు డెహ్రాడూన్ వచ్చిన తర్వాత ప్రయాణికులు దిగిపోయారు.


Also Read: ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..

ఈ సమయంలో తొలుత డ్రైవర్, కండెక్టర్ అత్యాచారానికి పాల్పడినట్లు అజయ్ సింగ్ చెప్పారు. అనంతరం పక్కన బస్సులు నిలిపిన ఇద్దరు డ్రైవర్లతోపాటు ఆ బస్టాండ్ లోని క్యాషియర్ కూడా అఘాయిత్యానికి పాల్పడ్డినట్లు తేలింది. వెంటనే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Related News

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Big Stories

×