Hyderabad News: డ్రగ్స్ రహితంగా తెలంగాణను మార్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడో ఒక దగ్గర డ్రగ్స్ పట్టుబడుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పరిధిలోని పోలీసులు ఎక్కడికక్కడ నిఘాను కఠినతరం చేశారు. దీంతో డ్రగ్స్ ముఠా మూడో కంటికి తెలియకుండా వివిధ రాష్ట్రాల నుంచి వాటిని హైదరాబాద్ నగరానికి సరఫరా చేయడం మొదలుపెట్టింది.
డ్రగ్స్ సరఫరా చేస్తూ నలుగురు చిక్కారు
తాజాగా మరోసారి డ్రగ్స్ ముఠా గుట్టును ఎస్‌వోటీ పోలీసులు రట్టు చేశారు. రాజేంద్రనగర్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్న నలుగుర్ని అరెస్టు చేశారు. నైజీరియా నుంచి డెడ్ డ్రాప్ పద్ధతిలో యువకులు వాటిని తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. బెంగళూరు నుంచి యువకులు డ్రగ్స్ తీసుకొని హైదరాబాద్‌కు బస్సులో వస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్ సప్లయర్స్ సంతోష్‌తోపాటు గాంధీ, సందీప్, శివ పలక సాయిబాబులను అరెస్టు చేశారు. వారి నుంచి పెద్ద మొత్తంలో ఎండిఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
బెంగుళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్
మరోవైపు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 22 డ్రోన్లు, 22 రిమోట్‌లను పట్టుకున్నారు అక్కడి సెక్యూరిటీ సిబ్బంది. సింగపూర్ ఎయిర్ లైన్స్‌లో వచ్చిన ముత్తు కనపన్ సతీష్ కుమార్ అనే వ్యక్తి వద్ద వీటిని గుర్తించారు. సింగపూర్ నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కు వచ్చిన సతీష్ కుమార్ వాటిని షేక్ హైమద్ అలీకి ఇస్తుండగా సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు వాటిని పట్టుకున్నారు.
పట్టుబడిన డ్రోన్-రిమోట్ ల విలువ దాదాపు 26.7 లక్షలు ఉంటుందని అధికారుల అంచనా. ఇద్దరు నిందితులను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ. నింధితులను ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఇటు డ్రగ్స్.. సీజ్ చేసిన డ్రోన్ల గురించి మరింత సమాచారం తెలియాల్సివుంది.
ALSO READ: మంటల్లో కాలిబూడిదైన బస్సు, ఎక్కడ?