E-Paper
Advertisement

Bengaluru: దారుణం.. తండ్రి అప్పు చెల్లించలేదని కుమార్తెపై అత్యాచారం!

Bengaluru:  దారుణం.. తండ్రి అప్పు చెల్లించలేదని కుమార్తెపై అత్యాచారం!
Advertisement

Minor girl raped in Bengaluru: బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. తండ్రి అప్పు కట్టలేదని అతని మైనర్‌ కుమార్తెపై ఓ వడ్డీ వ్యాపారి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పు తిరిగి చెల్లించనందుకు ప్రతీకారంగా 17 ఏళ్ల మైనర్‌పై 39 ఏళ్ల వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అప్పు చెల్లించాలని బాలికను బెదిరించడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ మేరకు ఆయనను మదనాయకహళ్లి పోలీసులు అరెస్టు చేశారు.

వివరాల ప్రకారం.. బెంగళూరులో రవికుమార్ అనే వ్యాపారి వద్ద బాలిక తండ్రి రూ.70 వేలు తీసుకున్నాడు. కొంతకాలం తర్వాత రూ.30 వేలు తిరిగి ఇచ్చాడు. అయితే మిగతా రూ.40వేల కోసం రవికుమార్ నిత్యం వాళ్ల ఇంటికి వెళ్లేవాడు. ఈ తరుణంలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అప్పు చెల్లించాలని బాలికను బెదిరించాడు. ఈ సమయంలో బాగా ఒత్తిడి గురిచేసి చెంపపై కిస్ చేసి పోస్ట్ చేస్తానని బెదిరించాడు. అనంతరం అత్యాచారానికి ఒడిగట్టాడు.

Advertisement

మైనర్ బాలిక భయాందోళనతో కుటుంబసభ్యులకు ఏడ్చుకుంటూ చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×