BigTV English

Lucky Baskhar Trailer: సిగరెట్, ఆల్కహాల్ ఇచ్చే కిక్ కన్నా డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ.. అందుకే తప్పు తప్పదు!

Lucky Baskhar Trailer: సిగరెట్, ఆల్కహాల్ ఇచ్చే కిక్ కన్నా డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ.. అందుకే తప్పు తప్పదు!

Lucky Baskhar Trailer: యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి సినిమా అంటే లవ్ స్టోరీ ఉండాలి. హీరో, హీరోయిన్ మధ్య గొడవ జరగాలి, మళ్లీ కలిసిపోవాలి.. ఇదే ఫార్మాట్‌లో ఉంటుందని ప్రేక్షకులు అనుకుంటారు. కానీ మొదటిసారి తన రొటీన్ ఫార్ములాను మార్చి ఒక కమర్షియల్ సినిమాతో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేయనున్నాడు ఈ దర్శకుడు. అందుకే దుల్కర్ సల్మాన్‌తో కలిసి ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) అనే సినిమా తీశాడు. ఇప్పటికే లవర్ బాయ్‌గా గుర్తింపు సంపాదించుకున్న దుల్కర్ కూడా ఈసారి కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశాడు. తాజాగా విడుదలయిన ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే వెంకీ అట్లూరి, దుల్కర్ సల్మాన్ కలిసి ఏ రేంజ్‌లో ప్రయోగం చేశారో అర్థమవుతోంది.


అసలు కథ

‘‘నా పేరు భాస్కర్ కుమార్. నా జీతం రూ.6 వేలు. దరిద్రంలో బ్రతుకుతున్నా నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి. నా బలం.. నా భార్య’’ అంటూ దుల్కర్ సల్మాన్ చెప్పే డైలాగ్‌తో ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ మొదలవుతుంది. తర్వాత నెల ప్రమోషన్ వస్తుంది అని దుల్కర్ చెప్పగానే తమ కష్టాలు అన్నీ తీరిపోతాయంటూ చాలా సంతోషిస్తుంది మీనాక్షి చౌదరీ (Meenakshi Chaudhary). అలా దుల్కర్, మీనాక్షి, తన కొడుకుతో ఒక హ్యాపీగా ఫ్యామిలీలాగా కనిపిస్తారు. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. డబ్బు లేక దుల్కర్ జీవితంలో కష్టాలు మొదలవుతాయి. ‘‘డబ్బు ఉంటేనే మర్యాద, ప్రేమ’’ అని మీనాక్షి కూడా చెప్పడంతో ‘‘ఇలాంటప్పుడే ఫ్యామిలీ కోసం ఎంత రిస్క్ చేసినా తప్పులేదనిపిస్తుంది’’ అంటూ దుల్కర్ ఒక నిర్ణయం తీసుకుంటాడు.


Also Read: రాజా సాబ్ కాదు రాజా ది గ్రేట్… ప్రభాస్ లుక్ పై ట్రోలింగ్

అంత డబ్బు ఎలా

దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) జీవితంలో ఒక వ్యక్తి రావడంతో, ఒక సంతకంతో పెట్టడంతో తన జీవితమే మారిపోతుంది. ఉన్నట్టుండి అన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయంటే కొందరికి బోనస్ అని చెప్తాడు, కొందరికి లాటరీ విన్ అయ్యానని చెప్తాడు, కొందరికి బిజినెస్ అని చెప్తాడు. కానీ నిజానికి అంత డబ్బు తనకు ఎక్కడి నుండి వచ్చిందో ఎవరికీ తెలియదు. తన భార్య మీనాక్షికి అయితే దుల్కర్‌పై అనుమానం వచ్చి ‘చెడు తిరుగుళ్లు తిరుగుతున్నావా’ అని అడుగుతుంది. తన ఫ్రెండ్ ఏమో మాఫియాలో చేరావా అని అడుగుతాడు. ‘‘కాలి గోటి నుండి తల వరకు ఏం కావాలంటే అది కొనుక్కో అంత సంపాదించాను’’ అంటూ భార్యకు ఆఫర్ ఇస్తాడు దుల్కర్.

బలుపు కాదు బలం

డబ్బు వచ్చిందని దుల్కర్ ప్రవర్తన మారిపోతుంది. అది మీనాక్షికి నచ్చదు. ‘‘ఇంక చాలు. మాటల్లో ఇంత అహంకారం. చేతల్లో బలుపు. ఇంత చెడ్డవాడిలాగా మారిపోతావని అనుకోలేదు’’ అని మీనాక్షి చెప్తుంటుంది. ‘‘అహంకారం కాదు ధైర్యం. బలుపు కాదు బలం. నేను చెడ్డవాడిని కాదు రిచ్’’ అంటూ పొగరుగా సమాధానమిస్తాడు దుల్కర్. ‘‘సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇచ్చే కిక్ కన్నా డబ్బు ఇచ్చే కిక్కే ఎక్కువ. ఇది ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. మర్యాద కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి’’ అని దుల్కర్ సల్మాన్ చెప్పే డైలాగ్‌తో ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్ ముగుస్తుంది. దీపావళి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×