BigTV English

Haryana: మోడల్ శీతల్ దారుణహత్య.. దగ్గరి బంధువులా? వేరే గ్యాంగ్ పనా?

Haryana: మోడల్ శీతల్ దారుణహత్య.. దగ్గరి బంధువులా? వేరే గ్యాంగ్ పనా?

Haryana: మోడల్ శీతన్‌ను గొంతు కోసి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. మృతదేహాన్ని కాలువలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన హర్యానాలోని సోనిపట్ ప్రాంతంలో వెలుగు చూసింది. వారం కిందట నుంచి కనిపించకుండా పోయింది.   చివరకు ఆమె మృతదేహాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు షాకయ్యారు. అసలేం జరిగింది?


హర్యానా మ్యూజిక్ ఇండస్ట్రీలో మోడల్‌గా పని చేస్తోంది శీతల్‌.  ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి ఆమె కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తు చేపట్టిన అధికారులకు ఓ కాలువలో శవమై కనిపించింది. వెంటనే ఆమె తల్లిదండ్రులకు కబురు పెట్టారు. వారొచ్చి మృతదేహాన్ని చూసి గుర్తు పట్టారు.

గుర్తు తెలియని వ్యక్తులు ఆమెని గొంతు కోసి హత్య చేసి కాలువలో పడేశారు. సోనిపట్ ప్రాంతంలోని కండా గ్రామంలోని ఓ కెనాల్‌లో గుర్తించారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. శీతల్‌ను హత్యకు కారణాలు తెలియాల్సివుంది.


పరారీలో ఉన్న నిందితుల ఆచూకీ గుర్తించేందుకు దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. సిమ్మీ అని కూడా పిలువబడే శీతల్ పానిపట్ కు చెందినది. అహర్ గ్రామంలో జరగాల్సిన హర్యాన్వి ఆల్బమ్ షూట్‌కు శీతల్ వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. ఆమె సోదరి జూన్ 14న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

ALSO READ: శంషాబాద్‌లో హై టెన్షన్.. తిరుపతి విమానంలో పొగలు

శీతల్ రెండు రోజుల కిందట సునీల్ అనే వ్యక్తితో కలిసి కారులో బయలుదేరింది. వాహనం అనుమానాస్పద స్థితిలో కాలువలో పడిపోయినట్లు తెలుస్తంది. సునీల్‌ను రక్షించడంతో పానిపట్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వాహనం బయటకు తీసే ప్రయత్నంలో శీతల్ మృతదేహం బయటపడింది.

ఈ కేసును సోనిపట్-పానిపట్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. శీతల్ శరీరంపై గాయాలున్నాయని డిఎస్పీ రాజ్‌బీర్ సింగ్ అన్నారు. హత్య కేసు భావిస్తున్నట్లు తెలిపారు.  ఈ కేసు పానిపట్ పోలీసులకు సవాల్‌గా మారింది.

ఇటీవల పంజాబ్‌కు చెందిన సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ కంచన్‌ కుమారి హత్యకు గురైంది. బఠిండా జిల్లాలో మెడికల్ కాలేజీ పార్కింగ్ స్థలంలో కారులో మృతదేహాన్ని గుర్తించారు. కంచన్‌కు ఇన్‌స్టాగ్రాంలో దాదాపు 4 లక్షలమంది ఫాలోవర్లు ఉన్నారు. 2.36 లక్షల మంది చందాదారులతో ‘ఫన్నీ భాబీ టీవీ’ పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ నిర్వహిస్తోంది. ఇంటినుంచి బయటకు వెళ్లిన కంచన్ తిరిగి రాలేదు. స్థానికులు సమాచారంతో కారులో ఆమె మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే.

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×