BigTV English

The Raja Saab: రాజాసాబ్ రన్ టైమ్ ఏంటీ భయ్యా ఇంత ఉంది… ప్రేక్షకులకు పెద్ద పరీక్షనే?

The Raja Saab: రాజాసాబ్ రన్ టైమ్ ఏంటీ భయ్యా ఇంత ఉంది… ప్రేక్షకులకు పెద్ద పరీక్షనే?

The Raja Saab: టాలీవుడ్ రెబల్, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) ఇటీవల వరుస సినిమాలకు కమిట్ అవుతూ బిజీగా ఉన్నారు.  ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అయితే అందరి హీరోల మాదిరి కాకుండా ఈయన ఏడాదికి ఒక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ ఈ ఏడాది చివరిన రాజాసాబ్(Raja Saab) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.


డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు పాన్ ఇండియా స్థాయిలో తెరికెక్కించారు. ఇక ఈ సినిమా హర్రర్ కామెడీ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ టీజర్ కు సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ఈ టీజర్ లాంచ్ కార్యక్రమం అనంతరం చిత్ర బృందం ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా డైరెక్టర్ మారుతి సినిమాకు సంబంధించిన అనేక విషయాలను వెల్లడించారు.

రాజా సాబ్ రన్ టైం…


ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. ప్రభాస్ సినిమాలంటేనే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ సినిమాలన్నీ కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఇలా ఒకేసారి ఐదు భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాని ఎందుకని ఇంగ్లీష్ లో విడుదల చేయలేదు అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు మారుతి సమాధానం చెబుతూ.. రాజాసాబ్ సినిమా 3.30 ని.ల నిడివి ఉందని అంతసేపు ఆడియన్స్ కూర్చోలేరు అంటూ ఈయన ఈ సినిమా రన్ టైం బయట పెట్టేశారు.

ఇంగ్లీష్ భాషలో విడుదల చేయొచ్చుగా…

ఈ సినిమా నిడివి ఎక్కువ ఉంటే ఇందులో పాటలను తీసేసి అక్కడ కూడా విడుదల చేయొచ్చు కదా మనం స్పైడర్ మాన్, సూపర్ మాన్ సినిమాలను ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కూడా ఈ సినిమాని విడుదల చేస్తూ ఒక ఎక్స్పరిమెంట్ చేస్తే బాగుంటుంది కదా అని సలహాలు ఇచ్చారు. మరి రిపోర్టర్స్ సలహా మేరకు మారుతి ఈ విధమైనటువంటి ఎక్స్పరిమెంట్ చేస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది అయితే ఈ సినిమా రన్ టైం ఏకంగా 3.30 నిమిషాలు ఉందని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటే పర్లేదు కానీ , ఏమాత్రం తేడా కొట్టిన మొదటికే మోసం వస్తుంది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×