Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో హై టెన్షన్ నెలకొంది. శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్న ఓ విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే స్పైస్ జెట్ 2138 అనే విమానంలో మంటలు చెలరేగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాలిన వాసన విపరీతంగా… వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో విమాన సిబ్బంది అలర్ట్ అయ్యారు. విమానం టేక్ ఆఫ్ కాకముందే ఈ ప్రమాదం జరిగిందట.
Also Read: Kohli-ABD: ఆ లేడీ ప్రెగ్నెంట్..తన్నుకున్న కోహ్లీ, డివిలియర్స్.. ముఖం మీదే ఛీ కొట్టాడు ?
దింతో ఆ విమానాన్ని అక్కడే నిలిపివేసి… తనిఖీలు చేస్తున్నారు అధికారులు. అయితే హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో మంటలు చెలరేగడంతో… ప్రయాణికులు కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది. దాదాపు మూడు గంటల పాటు ఎయిర్ పోర్టులోనే ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ఇక ఈ సంఘటన జరగగానే శంషాబాద్ విమానాశ్రయంలో ఒక్కసారిగా హై టెన్షన్ మొదలైంది. అక్కడ ఉన్న మిగతా ప్రయాణికులు కూడా భయాందోళనకు గురయ్యారు. అహ్మదాబాద్ లో మొన్న ఎయిర్ ఇండియా విమానం ధ్వంసమైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఎక్కడ ప్రమాదం జరిగిన ప్రయాణికులంతా వణికి పోతున్నారు. ఇక శంషాబాద్ విమానాశ్రయంలో జరిగిన ఈ ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
వణికిస్తున్న విమానాల ప్రమాదాలు
ఇటీవల అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన తొమ్మిది నిమిషాల్లోనే పెను ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో ప్రయాణించిన 241 ప్రయాణికులు అందులో మరణించారు. ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి దూకి.. ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఎయిర్ ఇండియా విమానం… నేరుగా వెళ్లి మెడికల్ కాలేజీ… పైన పడటంతో అందులో ఉన్న మెడికోలు కూడా మరణించారు. ఇలా మొత్తం 270 కి పైగా మరణించడం జరిగింది. ఈ పెను ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మృతి చెందారు.
Also Read: RCB Stampede: 11 మంది చావులకు కారణం..దొంగచాటుగా పారిపోతున్న RCB ప్రెసిడెంట్ ?
కేదార్నాథ్ భక్తులు మృతి
అహ్మదాబాద్ సంఘటన మరువక ముందే ఉత్తరాఖండ్ లో మరో ప్రమాదం జరిగింది. కేదార్నాథ్ సమీపంలో ఆదివారం రోజు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో.. చిన్నారి తో పాటు మొత్తం ఏడుగురు భక్తులు మరణించారు. వాతావరణం అనుకూలించినప్పటికీ కూడా… హెలికాప్టర్ మూవ్ చేశారు. ఈ తరుణం లోనే ప్రమాదం జరిగింది. ఇక కేదార్నాథ్ సమీపంలో ఈ హెలికాప్టర్ ప్రమాదం జరగడంతో… అక్కడే ఉన్న భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ప్రమాదం నేపథ్యంలో ఉత్తరాంఖడ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. హెలికాప్టర్ కుప్పకూలిన నేపథ్యంలో చార్ ధం యాత్ర కోసం ఏర్పాటుచేసిన హెలికాప్టర్ సేవలను రెండు రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటన చేసింది.