Kadapa News: ఏపీలో వడ్డీ వ్యాపారుల వేధింపులు తీవ్రమవుతున్నాయా? అప్పు తీరుకున్నవారిని టార్చర్ పెడుతున్నారా? ఓ యువకుడి మృతికి వడ్డీ వ్యాపారాలు కారణమా? ఇంతకీ కడప జిల్లాలో ఏం జరిగింది? బాధిత బంధువులు ఏమంటున్నారు? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
వడ్డీ వ్యాపారుల వేధింపులు, కడప జిల్లాలో యువకుడు సూసైడ్
కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేదక జీజీఎస్ తాండకు చెందిన ఓ వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. దీనిపై మృతుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప డీఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
జీజీఎస్ తాండకు చెందిన మహేంద్ర నాయక్ అవసరాల నిమిత్తం వడ్డీ వ్యాపారి సుధాకర్ నాయక్ వద్ద కొంత రుణం తీసుకున్నాడు. అయితే అనుకోని సమస్యల వల్ల కాస్త డిలే అవుతూ వచ్చింది. ఈ క్రమంలో వడ్డీ వ్యాపారి తరపున కానిస్టేబుల్ ఈశ్వర్ నాయక్ తరచు ఫోన్ చేసి బాకీ విషయంపై బెదిరించడం మొదలుపెట్టాడు. అందులోకి నేరుగా పోలీసు దిగడంతో బాధితుడు ఆందోళనకు గురయ్యాడు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో చావు ఒక్కటే మార్గమని భావించాడు. చివరకు రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉన్నట్లుండి మహేంద్ర నాయక్ ఆత్మహత్య చేసుకోవడంలో ఫ్యామిలీ సభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. ఈ విషయంలో బాధిత కుటుంబ సభ్యులు డీఎస్పీ ఆఫీసుకు వెళ్లి ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన డీఎస్పీ ఈ కేసు విచారించి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితులు వెనక్కి తగ్గారు.
కామారెడ్డి జిల్లాలో మరో దారుణం
మరోవైపు తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో మరొక విషాదం చోటు చేసుకుంది. ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడిన ఓ యువకుడు అప్పులపాలయ్యాడు. ఈ గండం నుంచి గట్టెక్కలేక చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని ఓంశాంతి కాలనీకి చెందిన శ్రీకర్ ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. వస్తున్న జీతం చాలక, డబ్బుల కోసం పక్కదాని పట్టాడు.
ALSO READ: ఏపీలో ట్రావెల్ బస్సు బోల్తా, స్పాట్‌లో ఆరుగురు
ఏడాదిన్నర నుండి ఆన్లైన్ గేమింగ్‌కు అలవాటు పడ్డాడు. సుమారు 20 లక్షల వరకు అప్పుల పాలయ్యాడు. వీరి బాధలు భరించలేక ఇల్లు అమ్మి కొన్ని అప్పులను చెల్లించాడు. అయినా అప్పులు తీరలేదు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీకర్ బెడ్‌రూమ్‌లో చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈలోగా బయటకు వెళ్లిన తల్లి ఇంటికి వచ్చేసరికి కొడుకుని చూసి షాకైంది. కుటుంబ సభ్యులు వెంటనే శ్రీకర్‌ని ప్రభుత్వాసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లి గోదావరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.