Chris Gayle: వెస్టిండీస్ దిగ్గజ ప్లేయర్ క్రిస్ గేల్ (Chris Gayle) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచినీళ్లు తాగినంత ఈజీగా సిక్సులు కొడుతూ ఉంటాడు భీకర ఆటగాడు క్రిస్ గేల్. అలాంటి డేంజర్ ప్లేయర్ గేల్ ఇప్పుడు రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కొత్త సంవత్సరం వేడుకలను చాలా డిఫరెంట్ గా గేల్ చేసుకున్నాడు. లంబాడీలు, ట్రైబల్స్ తరహాలో డ్రెస్ ధరించి కుప్పిగంతులు వేశాడు క్రిస్ గేల్. విదేశాల్లో ఉన్న ఓ ట్రైబల్స్ కు సంబంధించిన డ్రెస్ ధరించి రచ్చ రచ్చ చేశాడు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ చిందులు వేశాడు క్రిస్ గేల్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత క్రిస్ గేల్ పిచ్చివాడిలా తయారయ్యాడని కామెంట్స్ చేస్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకలను ఇలా కూడా డిఫరెంట్ గా చేసుకున్నాడని క్రిస్ గేల్ ను కొంతమంది మెచ్చుకుంటున్నారు. క్రిస్ గేల్ ఏది చేసినా చాలా డిఫరెంట్ గా ఉంటుందని మరికొంతమంది అంటున్నారు.
వెస్టిండీస్ దేశానికి చెందిన దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా పేరు పొందిన క్రిస్ గేల్, ఎన్నో అఖండ విజయాలను జట్టుకు అందించాడు. సింగిల్స్ తీయకుండా కేవలం సిక్సర్లు లేదా బౌండరీలు కొట్టి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఉంటాడు. నిలబడి మంచినీళ్లు తాగినట్టు సులభంగా సిక్సులు కొట్టేస్తాడు. అలా ఒంటి చేత్తో వెస్టిండీస్ కు ఎన్నో విజయాలను అందించాడు. 46 ఏళ్ల ఈ డేంజర్ ఆటగాడు యూనివర్సల్ బాస్ గా కూడా పిలవబడుతున్నాడు. 1999 నుంచి 2021 వరకు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగాడు క్రిస్ గేల్.
ఈ నేపథ్యంలోనే 103 టెస్టులు ఆడిన క్రిస్ గేల్ 7214 పరుగులు సాధించాడు. ఇందులో 15 సెంచరీలతో పాటు 73 వికెట్లు పడగొట్టాడు. ట్రిపుల్ సెంచరీ కూడా సాధించాడు. అలాగే 301 వండేలు వాడిన క్రిస్ గేల్ 10000 కు పైగా పరుగులు సాధించాడు. ఇందులో 25 సెంచరీలు చేసిన క్రిస్ గేల్ 167 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ టి20లో 79 మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 1899 పరుగులు మాత్రమే సాధించిన క్రిస్ గేల్ రెండు సెంచరీలు నమోదు చేసుకున్నాడు. 20 వికెట్లు కూడా పడగొట్టాడు.
2009 నుంచి 2021 వరకు ఐపీఎల్ టోర్నమెంట్ లో కొనసాగాడు క్రిస్ గేల్. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు మొత్తం మూడు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. మొదట కేకేఆర్ జట్టుకు 2008 నుంచి 2010 వరకు కొనసాగాడు. అప్పుడు పెద్దగా రానించలేదు క్రిస్ గేల్. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరుపున బరిలోకి దిగిన తర్వాత అద్భుతంగా రాణించాడు. ఆ జట్టులో 2011 నుంచి 2017 వరకు కొనసాగాడు. అనంతరం 2018 నుంచి 2021 వరకు పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ ఐపిఎల్ ఖరీదులో పూనే వారియర్స్ పై 175 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు. ఇదే మ్యాచ్లో 30 బంతుల్లో సెంచరీ కూడా చేసి సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు. ఐపీఎల్ లో 357 సిక్సర్లు కొట్టిన ఏకైక ప్లేయర్ క్రిస్ గేల్.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==