Vikarabad: వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన ఓ ఘటన అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. కన్న కూతురు అని కూడా చూడకుండా.. ఆమె ప్రేమను చెడగొట్టాలనే ఆలోచనతో ఓ తల్లి చేసిన పని స్థానికంగా కలకలం రేపింది. తాండూరులోని ఇంద్ర నగర్ కాలనీలో నివసించే ఓ మహిళ, తన కూతురు ఒకరిని ప్రేమిస్తోందన్న విషయం తెలిసి తట్టుకోలేకపోయింది. ఎలాగైనా ఆ ప్రేమను విడగొట్టాలని భావించి, తప్పుడు మార్గాన్ని ఎంచుకుంది.
సమస్యను మాటలతో పరిష్కరించుకోవాల్సింది పోయి, ఒక మంత్రగాడిని ఆశ్రయించింది. అతని సలహాతో కన్న కూతురిపైనే క్షుద్ర పూజలు చేయించేందుకు సిద్దపడింది. ఇందులో భాగంగా ఇంద్రనగర్ కాలనీ సమీపంలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తన కూతురిని తీసుకెళ్లి, అక్కడ మంత్రగాడితో కలిసి పూజలు మెుదలుపెట్టింది.
అయితే.. నిర్మానుష్య ప్రదేశంలో అర్థరాత్రి వేల వింతగా పూజలు చేస్తుండటాన్ని గమనించిన స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ఏం జరుగుతుందో చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమైన జనం ఆ మంత్రగాడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు. కన్న తల్లే ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి కూతురి జీవితంతో ఆడుకోవాలని చూడటంపై స్థానికుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.
Also Read: హయత్‌నగర్ పెట్రోల్ బంక్‌లో నయా మోసం.. 27 లీటర్ల ట్యాంక్.. 32 లీటర్ల బిల్లు.. అసలు ఏం జరుగుతోంది?
కూతురు ప్రేమను చెడగొట్టేందుకు తల్లి క్షుద్రపూజలు
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం వెలుగుచూసింది. తన కూతురు ప్రేమను చెడగొట్టాలనే ఉద్దేశంతో ఓ తల్లి మంత్రగాడితో కలిసి కూతురిపైనే క్షుద్రపూజలు చేయించింది. ఇంద్రనగర్ కాలనీలో నిర్మానుష్య ప్రదేశంలో పూజలు నిర్వహిస్తుండగా గమనించిన… pic.twitter.com/ZNSgktYW3z
— ChotaNews App (@ChotaNewsApp) May 1, 2026