BigTV English

Mother Puts Baby in Oven: దారుణం.. చంటిపాపను పొరపాటున ఓవన్‌లో పెట్టి మరిచిపోయిన తల్లి

Mother Puts baby in Oven | నెల వయసున్న ఓ చంటి పాప నిద్రపోయిన తరువాత తల్లి.. ఆ పాపను పొరపాటున ఓవన్(తలుపు ఉన్న ఎలెక్ట్రిక్ పొయ్యి)లో పెట్టి మరిచి పోయింది. కొద్ది సేపు తరువాత ఆమెకు తన పాప గురించి గుర్తుకు వచ్చి.. వెళ్లి చూస్తే.. పాప ఊపిరి తీసుకోవడం లేదు.

Mother Puts Baby in Oven: దారుణం.. చంటిపాపను పొరపాటున ఓవన్‌లో పెట్టి మరిచిపోయిన తల్లి

Mother Puts baby in Oven: నెల వయసున్న ఓ చంటి పాప నిద్రపోయిన తరువాత తల్లి.. ఆ పాపను పొరపాటున ఓవన్(తలుపు ఉన్న ఎలెక్ట్రిక్ పొయ్యి)లో పెట్టి మరిచి పోయింది. కొద్ది సేపు తరువాత ఆమెకు తన పాప గురించి గుర్తుకు వచ్చి.. వెళ్లి చూస్తే.. పాప ఊపిరి తీసుకోవడం లేదు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే.. డాక్టర్లు పాప చనిపోయిందని తెలిపారు. ఈ ఘటన అమెరికాలోని కన్సాస్ నగరంలో జరిగింది.


అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం కన్సాస్ నగరంలో నివసించే మరియా థామస్(26) అనే మహిళ తన పాపను తీసుకొని డాక్టర్ల వద్దకు వెళ్లగా.. డాక్టర్లు పాపను పరీక్షించారు. పాప వేసుకున్న డైపర్ కాలి ఉంది. పాప శరీరంపై కాలిన గాయాలున్నాయి. దీంతో డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు.. పాప తల్లిని విచారణ చేయగా.. తాను పాపను క్రిబ్(చిన్నపిల్లల మంచం)లో పడుకోబెట్టడానికి పోయి.. పొరపాటున ఓవన్‌లో పెట్టేశానని తెలిపింది. అయితే పోలీసులు ఆమె కావాలనే పాపను ఓవన్‌లో పెట్టి హత్య చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. అందుకే మారియాని పోలీసులు అరెస్టు చేశారు.


మరియా గురించి మరింత విచారణ చేయగా.. ఆమె మానసిక స్థితి సరిగా లేదని ఇరుగుపొరుగు వారు తెలిపారు.

Tags

Related News

AP Student Murder: తుపాకీతో కాల్చి.. ఢిల్లీలో చిలకలూరిపేట యువకుడు మృతి

Hyderabad News: డేటింగ్ యాప్ ఉచ్చులో ఆ డాక్టర్‌.. 25 లక్షలు-15 తులాల బంగారం, మేటరేంటి?

Eluru News: ఆడిటర్ అంటూ ఆట ఆడేశాడు.. 2 కిలోల బంగారంతో పరార్, ఫైనాన్స్ కంపెనీలో మోసం

Uttar Pradesh News: మాట్లాడలేదని రగిలిపోయిన యువకుడు.. స్కూటీపై వెళ్తున్న మహిళకు నిప్పు, ఆ తర్వాత

Hyderabad News: హైదరాబాద్‌లో భారీగా పాత నోట్లు.. దాదాపు రెండు కోట్లు సీజ్, లెక్కల్లో తేడాలు

Mancherial Incident: నువ్వు లేక నేను లేను.. ప్రేమ విఫలం అయిందని జంట బలవన్మరణం

Big Stories

×