E-Paper
Advertisement

Chennai Crime: ఛీ.. ఛీ.. కన్నతల్లి ఎంత పని చేసింది.. చెన్నైలో దారుణమైన ఘటన

Chennai Crime: ఛీ.. ఛీ.. కన్నతల్లి ఎంత పని చేసింది.. చెన్నైలో దారుణమైన ఘటన
Advertisement

Chennai Crime: దారుణమైన ఘటన వెలుగు చూసింది. కూతుర్ని తన ప్రియుడితో అత్యాచారం చేయించింది తల్లి. సంచలనం రేపిన ఈ ఘటన చెన్నైలో బయటపడింది. చివరకు ఇంటి నుంచి తప్పించుకున్న కూతురు బంధువులకు ఈ విషయం చెప్పడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగింది?

తమిళనాడులో దారుణమైన ఘటన

Advertisement

చెన్నైలోని సాలిగ్రామానికి చెందిన ఓ వ్యక్తి వాచ్‌మేన్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు భార్య, ఓ కూతురు ఉంది. ఫ్యామిలీని దూరంగా ఉంచి వారానికి ఒకసారి ఇంటికి వెళ్లేవాడు. వారికి కావాల్సినవి చూసుకుని వచ్చేవాడు. ఆయన కూతురు వయస్సు 20 ఏళ్లు. భర్త దూరంగా ఉండడంతో ఆ వాచ్‌మేన్ భార్యకి మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

భర్త ఇంటికి రాని సమయంలో చీటికి మాటికీ ప్రియుడి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ విషయం కూతురు గమనించింది. ఆపై తల్లిని మందలించింది. ఈ విషయం నాన్నకు తెలిస్తే చంపేస్తాడని తల్లిని బెదిరించింది. దీంతో తల్లి-కూతురు మధ్య మాట్లాడుకోవడం మానేశారు. తన అంతర్గత విషయం కూతురికి తెలిసిందని భావించిన తల్లి, జనవరి మొదటివారంలో అనారోగ్యం బారినపడింది కూతురు.

Advertisement

కూతురిపై ప్రియుడితో అత్యాచారం చేయించిన తల్లి

ఈ సమయంలో నిద్రమాత్రలు కూతురుకి ఇచ్చింది. చివరకు తన ప్రియుడిని పిలిపించి కూతురిపై అత్యాచారం చేయించింది కామాంధురాలు. జనవరి నాలుగో వారంలో మరోసారి అనారోగ్యం బారిన పడింది. మళ్లీ నిద్రమాత్రలు ఇచ్చి తన ప్రియుడితో అత్యాచారం చేయించింది. స్పృహలోకి వచ్చిన యువతి ఒక్కసారిగా షాకైంది.

ఈ విషయం బయటకు చెబితే పరువు పోతుందని కూతుర్ని బెదిరించింది. కూతుర్ని ఓ గదిలో ఉంచి తాళం వేసింది. తల్లి పరిస్థితి అర్థం చేసుకున్న కూతురు, ఇంటి నుంచి తప్పించుకున్న బంధువుల ఇంటికి వెళ్లింది. యువతి తరపు దగ్గర బంధువులు తిరువణ్ణామలైలో ఉంటున్నారు. ఇంట్లో జరుగుతున్న వ్యవహారాన్ని బంధువులకు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ALSO READ: డేటింగ్ యాప్‌తో పరిచయం.. ఆపై సహజీవనం, చివరకు ఏమైందంటే

అప్పటికే రెండుసార్లు ప్రియుడితో కూతుర్ని అత్యాచారం చేయించింది తల్లి. కడుపునొప్పితో బాధపడుతున్న యువతిని బంధువులు ఆసుపత్రికి తరలించారు. ఆమె గర్భవతి తేలడంతో షాకైంది. దీనికి సంబంధించి యువతిని బంధువులు ప్రశ్నించడంతో పైవిషయాలు చెప్పింది.

ఈ క్రమంలో సెయ్యారు మహిళా పోలీసు‌స్టేషన్‌లో తల్లి-ఆమె ప్రియుడు దక్షిణామూర్తిపై ఫిర్యాదు చేసింది. ఈ ఘటన వడపళని ప్రాంతంలో జరగడంతో అక్కడి మహిళా పోలీస్‌స్టేషన్‌కి కేసుని బదిలీ చేశారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం యువతి తల్లి, ఆమె ప్రియుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×