BigTV English

Merugu Nagarjuna: చిక్కుల్లో మాజీ మంత్రి నాగార్జున, అత్యాచారం కేసు నమోదు

Merugu Nagarjuna: చిక్కుల్లో మాజీ మంత్రి నాగార్జున, అత్యాచారం కేసు నమోదు

Merugu Nagarjuna: అధికారం పోయిన తర్వాత వైసీపీ నేతలకు కష్టాలు మొదలవుతున్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలపై కేసులు నమోదు అయ్యాయి. లేటెస్ట్ వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై అత్యాచార కేసు నమోదు అయ్యింది.


విజయవాడకు చెందిన ఓ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు సారాంశం ఏంటంటే.. మాజీ మంత్రి మేరుగు నాగార్జున తనకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద 90 లక్షలు రూపాయలు తీసుకున్నారన్నది మొదటి పాయింట్.

రెండోది తనను శారీరంగా వాడుకున్నారని ఆరోపించారమె. తన డబ్బులు ఇప్పించాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంపై తాడేపల్లి పోలీసులు మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై అత్యాచార కేసు నమోదు చేశారు. ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్దాం..


విజయవాడకు చెందిన బాధిత తన సమస్యల నేపథ్యంలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే మేరుగు నాగార్జునతో  పరిచయం ఏర్పడింది. కొద్దిరోజులకే ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తన శాఖలో జాబ్ ఇప్పిస్తానని చెప్పి ఆ మహిళ నుంచి క్యాష్ రూపంలో 90 లక్షలు తీసుకున్నారన్నది ఆమె మాట.

ALSO READ: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ.. విచారణలో రాజ్ పాకాల, ఫారెన్ లిక్కర్ డీటేల్స్

సార్ చెప్పారని చెప్పి ఆయన పీఎం మురళీమోహన్‌రెడ్డి తాడేపల్లిలో మంత్రి ఉండే అపార్టుమెంట్‌కి తనను తీసుకెళ్లేవారని చెప్పుకొచ్చింది బాధిత మహిళ. ఈ క్రమంలో తనను అప్పటి మంత్రి బలవంతం చేశారని ఆరోపించింది. ఇలా మొత్తం నాలుగు సార్లు చేశారని తన గోడు మీడియా ముందు వెళ్లబోసుకుంది.

అదిగో ఇదిగో ఉద్యోగం అంటూ మాయమాటలు చెప్పారని, ప్రాధేయపడినా ఫలితం లేకపోయిందని తెలిపింది బాధితురాలు. చివరకు కోపం వచ్చి ఓసారి గట్టిగా నిలదీస్తే.. విశాఖలో ట్రైబల్ టీచర్ గంగా భవానీకి పట్టిన గతే పడుతుందని, గిఫ్ట్ కావాలా అంటూ హెచ్చరించారని వాపోయింది.

మంత్రి డబ్బులు తీసుకున్నట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటూ మీడియా ప్రశ్నించింది. తాను క్యాష్ రూపంలో మంత్రికి ఇచ్చానని, అందుకు సంబంధించి తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. కాకపోతే తాను అప్పులు చేసిన డీటేల్స్‌ను పోలీసులకు అందజేశానని వెల్లడించింది.

ఆ తర్వాత తాను ఫోన్ చేస్తే మాజీ మంత్రి లిప్ట్ చేయలేదని వాపోయింది. తాను మంత్రితో మాట్లాడిన ఫోన్ పోయిందని, ప్రస్తుతం కొత్త ఫోన్ వాడుతున్నట్లు చెప్పుకొచ్చింది. తనకు సీఎం, డిప్యూటీ సీఎం న్యాయం చేయాలంటూ మీడియా ముందు తన గోడు వెల్లబోసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై అత్యాచారం కేసు నమోదు చేశారు పోలీసులు.

Related News

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Big Stories

×