BigTV English

Janwada Farm House Party Case: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ.. విచారణలో రాజ్ పాకాల, ఫారెన్ లిక్కర్ డీటేల్స్

Janwada Farm House Party Case: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ.. విచారణలో రాజ్ పాకాల, ఫారెన్ లిక్కర్ డీటేల్స్

Janwada Farm House party Case: జన్వాడ ఫామ్ హౌస్ పార్టీపై కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయా? ఫారెన్ లిక్కర్ గురించి అసలు విషయాలు చెప్పాడా? రాజ్ పాకాల ఫోన్‌లో ఏ ముంది? పార్టీకి ముందు కీలక నేతలకు ఫోన్లు చేశాడా? ప్రస్తుతం ఫోన్ డేటా గుట్టు విప్పే పనిలో పోలీసులు పడ్డారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.


దీపావళికి ముందు జరిగిన జన్వాడ ఫామ్ హౌస్‌ పార్టీ గురించి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో సంచలనం రేపిన ఈ కేసులో రేపో మాపో కొందరికి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం.

ఫారెన్ లిక్కర్, పార్టీకి వచ్చిన కొందరు ప్రముఖుల గురించి కీలక విషయాలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. వీటిని నిర్థారించే పనిలో నిమగ్నమయ్యారు. కాల్ డేటాను పరిశీలించే పనిలో పడ్డారట పోలీసులు.


మొత్తం 50 ప్రశ్నలు సంధించిన అధికారులు, దాదాపు 20 ప్రశ్నలకు రాజ్ పాకాల సమాధానాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీకి పర్మీషన్ ఎందుకు తీసుకోలేదు? విదేశీ మద్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారా? స్థానిక షాపుల నుంచి తీసుకున్నారా? లేక విదేశాల నుంచి రప్పించారా?

ALSO READ: సార్ నేను బతికే ఉన్నా..పోస్ట్ మార్టంకు వెళుతుంటే లేచి కూర్చున్నాడు..!

ఒకవేళ విదేశాల నుంచి రప్పిస్తే ఎంత మొత్తంలో తెచ్చారు? ఎయిర్‌పోర్టులో తనిఖీలు చేయలేదా? అక్కడి నుంచి ఎలా తప్పించుకున్నారు? విదేశాల నుంచి వస్తే.. ఎక్సైజ్ డ్యూటీ ఎందుకు చెల్లించలేదు? తీసుకున్న లిక్కర్‌కు బిల్లులెక్కడ? ఆ లిక్కర్‌‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, సూపర్ వైజర్ మాత్రమే తెలుసని తప్పించుకునే ప్రయత్నం చేశాడట. కొన్ని ప్రశ్నలకు తెలీదని చెప్పుకొచ్చాడట.

రాజ్ పాకాల నుంచి ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులకు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఆయన కాల్ డేటాను క్షుణ్నంగా పరిశీలించిన పోలీసులు, పార్టీ సమయంలో ఎంతమంది హాజరయ్యారు? ఎవరెవరు వచ్చారు? విజయ్ మద్దూరికి కొకైన్ ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి తెప్పించారు? ఆయనతోపాటు మరెవరైనా తీసుకున్నారా? పోలీసులు తమ వద్ద నుంచి సమాచారాన్ని దగ్గర పెట్టుకుని ప్రశ్నలు లేవనెత్తినట్టు సమాచారం.

పార్టీకి ముందు కొందరి ప్రముఖులతో రాజ్ పాకాల మాట్లాడిన డేటాను దగ్గర పెట్టి ప్రశ్నలు రైజ్ చేశారట పోలీసులు. కాసేపట్లో పోలీసులు వస్తారనగా, అక్కడి నుంచి వారంతా ఎస్కేప్ అయ్యారట. తాను లోపల ఉన్నానని, ఎవరొచ్చారో చూడలేదంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడట. సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా అడిగిన కొన్ని ప్రశ్నలకు రాజ్ పాకాల సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

Related News

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Big Stories

×