E-Paper
Advertisement

Harish Rao: ఓవైపు యూరియా కష్టాలు.. మరోవైపు జల వివాదాలు.. హరీశ్ రావు ప్రశ్నల వర్షం

Harish Rao: ఓవైపు యూరియా కష్టాలు.. మరోవైపు జల వివాదాలు.. హరీశ్ రావు ప్రశ్నల వర్షం
Advertisement

Harish Rao: వరంగల్ పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు దేవన్నపేటలోని దేవాదుల పంప్ హౌస్ ఫేజ్ -III పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పంప్ హౌస్ 3 మోటార్లు పనిచేయట్లేదని పేర్కొన్నారు. గతేడాది మార్చి 18న మోటార్లు స్టార్ట్ చేస్తామని కాంగ్రెస్ మంత్రులు మాట్లాడారన్నారు. కానీ అది జరగలేదన్నారు. మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల 65 వేల ఎకరాలు ఎండిపోయాయని హరీశ్ రావు ఆరోపించారు.

బీఆర్ఎస్ హయాంలో రూ.7,300 కోట్లు ఖర్చుపెట్టి దేవాదుల పనులు 80 శాతం పూర్తిచేశామని హరీశ్ రావు గుర్తుచేశారు. 30 వేల ఎకరాల భూ సేకరణ తమ హయాంలో జరిగిందని.. 3 వేల ఎకరాల భూ సేకరణ చేసి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే 2 లక్షల 40 వేల ఎకరాలకు నీరు అందేదని పేర్కొన్నారు. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయకుండా రెండున్నరేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు.

Advertisement

2026 మార్చి నాటికి దేవాదుల పూర్తి చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని హరీశ్ రావు గుర్తుచేశారు. డైలాగులు కొట్టిన మంత్రులు ఇప్పుడు ఎక్కడకు పోయారని నిలదీశారు. ‘వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎక్కడ పోయారు. రైతులంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదు. భీమ్ ఘనపూర్ ప్రాజెక్టులో 10 మోటార్లు ఉంటే 5 మోటార్లు మాత్రమే నడుపుతున్నారు. గండిరామారం లిఫ్ట్ బందు చేశారు. మీ సగం టైమ్ అయిపోయింది. ఒక్క ఎకరానికి అదనంగా నీరు ఇవ్వలేదు’ అని హరీశ్ రావు అన్నారు. గత బీఆర్ఎస్ హయాంతో తాము ఏకంగా 48 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Also Read: Summer 2026 ACs Offers: టాప్ కంపెనీల ఏసీలపై.. కళ్లు చెదిరే డిస్కౌంట్లు.. ఈ ఛాన్స్ వదులుకోకండి!

Advertisement

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని హరీశ్ రావు దుయ్యబట్టారు. ‘మీరు రెండు పంటలకు రైతు బంధు ఎగ్గొట్టారు. యూరియా ఇవ్వక రైతులు గోస పడుతున్నారు. అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు. ఇరిగేషన్ లో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తెలంగాణ హక్కులు కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారు. రేవంత్ రెడ్డి ఆయన గురువుకు గురుదక్షిణ చెల్లిస్తున్నారు. అక్రమంగా కృష్ణా, గోదావరి నీళ్లను ఏపీకి వదులుతున్నారు. బణకచర్లను ఆపడంలో ఫెయిల్ అయ్యారు, కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోవడంలో ఫెయిల్ అయ్యారు’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Refrigerators for Medium Family: చిన్న ఫ్యామిలీకి.. సరిగ్గా సరిపోయే.. టాప్-5 ఫ్రిడ్జ్‌లు ఇవే!

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×