E-Paper
Advertisement

Road Accident: గోవా వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం, ముగ్గురు మృతి.. నర్సాపూర్‌లో విషాదం

Road Accident: గోవా వెళ్లి తిరిగి వస్తుండగా ఘోర ప్రమాదం, ముగ్గురు మృతి.. నర్సాపూర్‌లో విషాదం
Advertisement

Road Accident: మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నర్సాపూర్ పట్టణానికి చెందిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.

వివరాల్లోకి వెళ్తే.. నర్సాపూర్ నుంచి గోవాకు మూడు కార్లలో మొత్తం 15 మంది స్నేహితులు కలిసి ఈ ట్రిప్‌కు వెళ్లారు. కొన్ని రోజులుగా గోవాలో విహారయాత్రను సంతోషంగా గడిపిన వీరు, తిరుగు ప్రయాణంలో మహారాష్ట్రలోని షోలాపూర్ ప్రాంతానికి చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణంలో ఉన్న కార్లలో ఒక కారు అతివేగంతో దూసుకెళ్తుండగా, అకస్మాత్తుగా కారు టైర్ బోల్తా పడినట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ కారు ప్రమాద సమయంలో నలుగురు యువకులు ఉన్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన కారును తొలగించి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. టైర్ పేలడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నప్పటికీ, పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ విషయం తెలియగానే మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×