E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పూణె యంగ్ బిజినెస్‌మేన్ మృతి కేసు.. కాబోయే భార్య పక్కాగా ప్లాన్ చేసిందా? పోలీసుల విచారణలో

పూణె యంగ్ బిజినెస్‌మేన్ మృతి కేసు.. కాబోయే భార్య పక్కాగా ప్లాన్ చేసిందా? పోలీసుల విచారణలో
Advertisement

Pune businessman Case: కాబోయే భార్యను ఫొటో తీస్తూ లోయలోపడిన యంగ్ వ్యాపారవేత్త మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. తొలుత ప్రమాదమని భావించినా, ప్లాన్ ప్రకారం హత్య చేసినట్టు తెలుస్తోంది. కాబోయే భార్య ఈ ఘటనకు పాల్పడిందా? అనే కొత్త అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది.

పూణె యంగ్ బిజినెస్‌మేన్ కేతన్ మృతి కేసులో న్యూ ట్విస్ట్

Advertisement

పుణె సమీపంలోని గహుంజేకి 26 ఏళ్ల కేతన్‌ అగర్వాల్ రియల్ ఎస్టేట్ కంపెనీలో డైరెక్టరుగా ఉన్నాడు. అతడికి వివాహం ఓకే అయ్యింది. నవంబరులో జరిగే పెళ్లి వేడుక కోసం ఉదయ్‌పుర్‌లోని ఖరీదైన ప్యాలెస్‌ బుక్‌ చేశారు. అయితే జూన్‌ 19న కాబోయే భార్య పుట్టినరోజు కావడంతో వేడుకల కోసం కొంతమంది మిత్రులతో కలిసి లోహగఢ్‌ కోటకు వెళ్లాడు కేతన్‌.

అక్కడ ఏం జరిగిందో తెలీదు. కాకపోతే అంటే వేడుకలకు ఒక రోజు ముందు అంటే జూన్‌ 18న లోహగఢ్‌ కోట నుంచి 400 అడుగుల లోతు లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. తాము ట్రెక్కింగ్‌కు వచ్చినట్టు తొలుత చెప్పారు.

Advertisement

కాబోయే భార్య పక్కాగా ప్లాన్ చేసిందా?  ఎనిమిది మందిని విచారిస్తున్న పోలీసులు

తనను ఫొటోలు తీస్తుండగా బలమైన గాలికి పట్టుతప్పి లోయలో కేతన్‌ పడిపోయాడని కాబోయే భార్య పోలీసులకు చెప్పింది. ప్రమాదంగా భావించిన పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేపట్టారు. విచారణలో కేతన్‌ కాబోయే భార్య పొంతన లేని సమాధానాలు చెప్పడం మొదలుపెట్టింది. దీంతో పోలీసులకు అనుమానం రెట్టింపు అయ్యింది.

దర్యాప్తు చేస్తున్న క్రమంతో కేతన్‌ది హత్యగా ప్రాథమికంగా నిర్ధరించారు. కేతన్ కాబోయే భార్య, ఆమె మిత్రుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు పోలీసులు. కేతన్‌ను లోయలోకి తోసి ప్రమాదంగా చిత్రీకరించి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ప్రమేయం ఉందని భావించిన మరో ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించడానికి నిరాకరించారు.

ALSO READ: ఆ ఫ్యామిలీలో చిచ్చు రేపిన సహజీవనం.. నో చెప్పినందుకు పేరెంట్స్-చెల్లిని లేపేసింది 

మరోవైపు కాబోయే భార్యకు సంబంధించి ఫోన్ కమ్యూనికేషన్ గురించి ఆరా తీస్తున్నారు పోలీసులు. అందులో అసలు నిజాలు వెలుగుచూసే అవకాశముందని తెలుస్తోంది. ఘటన జరిగిన ప్రాంతం లోహగడ్ కోట మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ చరిత్రతో ముడిపడి ఉంది.  యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా జాబితాలో చేరిన మహారాష్ట్రలోని 12 కోటల్లో ఇది కూడా ఒకటి.

Related News

సీఐ నాగ‌రాజు! దృశ్యం సినిమాను మ‌రిపించిన అదృశ్యం కేసు! ఏపీ స‌ర్కార్‌ను బ‌ద్నాం చేసిన ఖాకీ..!

Nalgonda Deaths: నల్గొండ జిల్లాలో దారుణం.. ఒకే ఇంట్లో నలుగురు మృతి.. !

Fake Doctor: సంతాన లేమితో బాధపడుతున్నారా.. మేడ్చల్‌లో నకిలీ వైద్యుడు కలకలం

Bengaluru Triple Murder: ఆ ఫ్యామిలీలో చిచ్చు రేపిన సహజీవనం.. నో చెప్పినందుకు పేరెంట్స్-చెల్లిని

భార్యకు విదేశాల్లో ఉద్యోగం.. భర్త రాసలీలల్లో బిజీ, CCTV‌కి చిక్కిన కానిస్టేబుల్

Coaching Fire: లక్నో కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి!

వాహనాల తనిఖీలు.. జిల్లా అధికారిపై దూసుకొచ్చిన లారీ, స్పాట్‌లో అధికారి వెంకన్న మృతి

Big Stories

×