E-Paper
Advertisement

ఈ రోడ్లు ఉంటాయ్ భయ్యా.. నా భూతో నా భవిష్యత్.. లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

ఈ రోడ్లు ఉంటాయ్ భయ్యా.. నా భూతో నా భవిష్యత్.. లైఫ్‌లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!
Advertisement

Best Road Trips in India: సాధారణంగా విమానాల్లో ట్రిప్స్ కు వెళ్లేవారిని కదిలిస్తే.. ప్రకృతి అందాలు, విభిన్నమైన ఫుడ్, లగ్జరీ హోటల్స్ లో బస గురించి చెబుతుంటారు. కానీ రోడ్ ట్రిప్‌లు ఎక్కువగా చేసే వారిని అడిగితే అసలైన తీపి జ్ఞాపకాలన్నీ ప్రయాణంలో ఎదురైన అనుభవాల్లోనే దాగి ఉన్నాయని చెప్తారు. అనుకోకుండా ఆగిన ఒక టీ కొట్టు, నిర్మానుష్యంగా సాగే రోడ్డు, కొండల మలుపుల్లో ఎదురయ్యే అద్భుత దృశ్యాలు.. ట్రావెలర్స్ కు ఇచ్చే అనుభూతి వర్ణనాతీతం. వేగంగా వెళ్లడం కన్నా, తొందరపడకుండా సాగే ప్రయాణమే రోడ్ ట్రిప్‌లోని అసలైన మజాను అందిస్తుంది. మన దేశంలో అటువంటి అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని ఇచ్చే కొన్ని ప్రత్యేకమైన మార్గాలు ఉన్నాయి. అవేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

జిరో నుండి దాపోరిజో (అరుణాచల్ ప్రదేశ్)

పర్యాటకులను కట్టిపడేసే ప్రశాంతమైన ప్రాంతాల జాబితాలో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈ మార్గం ముందు వరుసలో ఉంటుంది. దట్టమైన పైన్ అడవులు, వెదురుతో చేసిన వంతెనలు, అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యే నదులు, కొండల నడుమ కొలువైన చిన్నచిన్న పల్లెలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడ ప్రయాణాన్ని ఎంత నెమ్మదిగా సాగిస్తే, ప్రకృతి అందాలను అంతగా ఆస్వాదించవచ్చు.

గోకర్ణ నుండి కార్వార్ (కర్ణాటక)

Advertisement

సాధారణంగా తీర ప్రాంత రోడ్ల అనగానే ఎదురుగా కనిపించే సముద్ర అలలు గుర్తుకొస్తాయి. కానీ గోకర్ణ నుండి కార్వార్ వెళ్లే మార్గం కాస్త భిన్నమైనది. ఇక్కడ అరేబియా సముద్రం ప్రయాణమంతా ప్రత్యక్షంగా కాకుండా కొబ్బరి తోటలు, చిన్న ప్రశాంతమైన మత్స్యకార గ్రామాలు వెనుక దాగుడుమూతలు ఆడుతూ కనిపిస్తుంది. ఉదయాన్నే ప్రయాణం ప్రారంభించి.. దారిలో మంచి హోటళ్ల వద్ద ఆగుతూ ముందుకు వెళ్లడం ఇక్కడ ఉత్తమమైన మార్గం. ఈ మార్గంలోని చిన్న చిన్న మలుపులే ఈ ప్రయాణంలో మర్చిపోలేని తీపి గుర్తులుగా మిగిలిపోతాయి.

బిన్సార్ నుండి మున్సియారీ (ఉత్తరాఖండ్)

కొండ ప్రాంతంలో చేసే ప్రయాణం సాహాసోపేతంగానే ఉండక్కర్లేదని ఈ మార్గం నిరూపిస్తుంది. ఓక్ అడవులు, మెట్ల మాదిరిగా ఉండే పచ్చని పొలాలు, ప్రశాంతమైన గ్రామాల గుండా ఈ రహదారి సాగుతుంది. ప్రయాణం చివరిలో ఊహించని విధంగా హిమాలయ శిఖరాలు కంటిముందు సాక్షాత్కరిస్తాయి. ఎటువంటి హడావుడి లేకుండా, నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ ప్రయాణించాలనుకునే వారికి ఈ పర్వత ప్రాంత రోడ్ ట్రిప్ ఒక గొప్ప జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

Advertisement

Also Read: కరోనాను ఖతం చేసే బ్రెజిల్ చెట్టు.. ఆకుల పవర్ చూసి సైంటిస్టులే షాక్!

జవాయ్ నుండి మౌంట్ అబు (రాజస్థాన్)

రాజస్థాన్ అనగానే అందరికీ ఎడారి, ఇసుక తిన్నెలే గుర్తుకొస్తాయి. కానీ జవాయ్ నుండి మౌంట్ అబు వెళ్లే ఈ మార్గం ఆ అంచనాలను తలకిందులు చేస్తుంది. ఇక్కడ ఎడారికి బదులుగా భారీ గ్రానైట్ కొండలు, నదులు, ఆకుపచ్చని గడ్డిభూములు స్వాగతం పలుకుతాయి. పెంపుడు జంతువుల వలె చిరుతపులులు ఇక్కడి ప్రజలతో కలసి జీవించే తీరు ఈ ప్రయాణానికి ప్రత్యేక గుర్తింపును ఇస్తుంది. మనం సాధారణంగా చూసే రాజస్థాన్‌కు ఇది పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది.

Also Read: చావుదెబ్బ కొట్టిన Airtel.. మీకిష్టమైన బడ్జెట్ ప్లాన్ డిలీట్.. తెరపైకి మరో చౌకైన రీఛార్జ్!

Tags

Related News

మెుబైల్ నెంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. సెప్టెంబర్ 25 డెడ్ లైన్.. ఈ ప్రచారంలో వాస్తవమెంత!

జీతం చాలట్లేదని ఫారెన్ ట్రిప్ ఆపేస్తున్నారా? ఈ 5 బడ్జెట్ ఫ్రెండ్లీ దేశాలు మీకోసమే!

రైలు కోచ్‌లకు రంగులు ఎందుకు? ఆ కలర్స్ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి!

రైలు ప్రయాణంలో ఆధార్ మర్చిపోయారా? టెన్షన్ వద్దు.. స్మార్ట్ ఫోన్ ఉంటే అంతా సెట్టు!

యోగా మ్యాట్ To బ్యూటీ క్రౌన్.. తెలంగాణ అమ్మాయి ప్రీతి క్రేజీ సక్సెస్ స్టోరీ!

పేదరికం లేని కుబేర దేశాలు.. ఈ మూడు కంట్రీస్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రైళ్ల భద్రతలో సరికొత్త విప్లవం.. మల్కాజ్‌గిరి – కామారెడ్డి మార్గంలో కవచ్ 4.0 ట్రయల్ సక్సెస్!

‘ఓ స్త్రీ రేపు రా’.. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికించిన వింత భయం వెనుక అసలు మిస్టరీ ఇదే!

Big Stories

Advertisement
×