E-Paper
Advertisement

కరోనాను ఖతం చేసే బ్రెజిల్ చెట్టు.. ఆకుల పవర్ చూసి సైంటిస్టులే షాక్!

కరోనాను ఖతం చేసే బ్రెజిల్ చెట్టు..  ఆకుల పవర్ చూసి సైంటిస్టులే షాక్!
Advertisement

COVID-19 Research: కోవిడ్-19 వైరస్‌ను సమర్థవంతంగా అడ్డుకోగల సహజ సిద్ధమైన సమ్మేళనాలను (Natural compounds) పరిశోధకులు గుర్తించారు. బ్రెజిల్‌లోని అట్లాంటిక్ ప్రాంతంలో పెరిగే ‘కాపాఇఫెరా లుసెన్స్’ (Copaifera lucens Dwyer) అనే చెట్టు ఆకుల నుంచి ‘గాల్లోయిల్ క్వినిక్ యాసిడ్స్’ (Galloylquinic acids) అనే కాంపౌండ్లను వేరు చేశారు. ప్రయోగశాల పరీక్షల్లో ఈ సమ్మేళనాలు కరోనా వైరస్‌ను వివిధ కోణాల్లో నిరోధిస్తున్నట్లు తేలింది. సాధారణ యాంటీవైరల్ మందులతో పోలిస్తే ఇవి విస్తృత స్థాయి రక్షణను అందిస్తున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

సుదీర్ఘ పరిశోధనల ఫలితం

యూనివర్సిటీ ఆఫ్ సావో పాలోకు చెందిన ‘రిబీరావో ప్రెటో స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్’ ప్రొఫెసర్ జైరో కెనుప్ బాస్టోస్ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టింది. వారు దీర్ఘకాలంగా కాపాఇఫెరా జాతికి చెందిన మొక్కల రసాయన స్వభావం, మూలికా గుణాలపై పరిశోధనలు చేస్తున్నారు. అయితే ‘కాపాఇఫెరా లుసెన్స్’ చెట్టు ఆకుల్లో గుర్తించిన ఈ గాల్లోయిల్ క్వినిక్ యాసిడ్స్ సైన్స్‌కు కొత్తేమి కాదు. గతంలో జరిపిన అధ్యయనాల్లో కూడా ఇవి ఫంగస్ నిరోధకంగా, క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయని వెల్లడైంది. అంతేకాకుండా హెచ్‌ఐవి-1 (HIV-1) వైరస్‌ను నిరోధించడంలోనూ ఇవి తక్కువ విషపూరిత స్వభావంతో సమర్థవంతంగా పనిచేసినట్లు తేలింది.

అనేక మార్గాల్లో వైరస్‌పై దాడి

Advertisement

ఫాపెస్ప్ (FAPESP) ఆర్థిక సహాయంతో నిర్వహించిన ఈ అధ్యయనంలో పరిశోధకులు ముందుగా ఆకుల నుంచి గాల్లోయిల్ క్వినిక్ యాసిడ్స్‌ను వేరు చేసి, వాటి కణ విషపూరితాన్ని (Cytotoxicity) పరీక్షించారు. ఆ తర్వాత ప్లాక్ రిడక్షన్ అసెస్ ద్వారా వైరస్‌ను ఇవి ఎంతవరకు నిర్వీర్యం చేయగలవో పరిశీలించారు. ఫలితాల్లో వర్ధమాన సార్స్-కోవ్-2 (SARS-CoV-2) పై ఇవి స్పష్టమైన ప్రతిరోధక శక్తిని చూపించాయి. శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం.. ఈ కాంపౌండ్లు ఒకేసారి అనేక మార్గాల్లో వైరస్‌పై దాడి చేస్తాయి. వీటిలోని స్పైక్ ప్రొటీన్ మానవ కణాల్లోకి వైరస్ ప్రవేశించకుండా అడ్డుకుంటాయి. పిఎల్ ప్రొటీజ్ (PLpro).. శరీర రోగనిరోధక వ్యవస్థ నుంచి వైరస్ తప్పించుకోకుండా నిరోధిస్తాయి. RNA పాలిమరేస్.. వైరస్ తన సంతతిని పునరుత్పత్తి చేసుకోకుండా నిలిపివేస్తాయి.

ఔషదాలతో పోలిస్తే మెరుగైన పనితీరు

‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం.. గాల్లోయిల్ క్వినిక్ యాసిడ్స్ వైరస్ జీవనచక్రాన్ని దెబ్బతీయడమే కాకుండా శరీరంలో వాపును తగ్గిస్తూ (Anti-inflammatory) రోగనిరోధక వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. ప్రస్తుత మందులు ఒకే రకమైన వైరల్ ప్రొటీన్‌పై పనిచేయడం వల్ల వైరస్ ఉత్పరివర్తనం (Mutation) చెందే ప్రమాదం ఉంటోంది. కానీ ఈ మల్టీ-టార్గెట్ విధానం వల్ల వైరస్ నిరోధకతను పెంచుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ప్రొఫెసర్ బాస్టోస్ వివరించారు.

Advertisement

Also Read: ‘రెడ్‌మి నోట్ 17 5జీ’ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు.. ధర ఎంతంటే?

ముందున్న సవాళ్లు

ప్రయోగశాల ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉన్నప్పటికీ.. వీటిని పూర్తిస్థాయి మందుగా మార్చడానికి ఇంకా సమయం పడుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో జీవులపై పరీక్షలు, ఆ తర్వాత మానవులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా, ఈ పరిశోధన ప్రకృతి సిద్ధమైన వనరుల నుంచి కొత్త ఔషధాలను కనుగొనవచ్చనే నమ్మకాన్ని పెంచింది. అలాగే బ్రెజిల్ లోని అట్లాంటిక్ అటవీ ప్రాంత జీవవైవిధ్యం ప్రపంచ ఆరోగ్య రక్షణలో ఎంత కీలక పాత్ర పోషించగలదో మరోసారి నిరూపించింది.

Also Read: తప్పు నంబర్‌కు రీఛార్జ్ చేశారా? టెన్షన్ వద్దు.. ఇలా చేస్తే డబ్బు రిఫండ్!

Tags

Related News

నాయిస్ సరికొత్త స్మార్ట్ వాచ్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో రచ్చ

రూ.5,247లకే.. బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్, వెంటనే కొనేయండి

రూ.889కే స్మార్ట్ వాచ్.. ఫీచర్లకు ఎవ్వరైనా ఫిదా!

మ్యూజిక్ లవర్స్‌కి గుడ్‌న్యూస్..రూ.899లకే అదిరిపోయే బ్లూటూత్ స్పీకర్

‘రెడ్‌మి నోట్ 17 5జీ’ వచ్చేసింది.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్లు.. ధర ఎంతంటే?

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. హాఫ్ ప్రైస్‌కే బెస్ట్ ట్యాబ్స్! డోంట్ మిస్

చావుదెబ్బ కొట్టిన Airtel.. మీకిష్టమైన బడ్జెట్ ప్లాన్ డిలీట్.. తెరపైకి మరో చౌకైన రీఛార్జ్!

Big Stories

Advertisement
×