E-Paper
Advertisement

పాత బాబ‌ర్ ను నిద్ర‌లేపారు..ఇక టీమిండియా రోజులు లెక్క‌పెట్టుకోవాల్సిందే!

పాత బాబ‌ర్ ను నిద్ర‌లేపారు..ఇక టీమిండియా రోజులు లెక్క‌పెట్టుకోవాల్సిందే!
Advertisement

Azhar Ali On Babar Azam:  పాకిస్తాన్ టెస్ట్ కెప్టెన్ బాబర్ ఆజం పైన సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ క్రికెటర్లు అయితే… బాబర్ ఆజం పాకిస్తాన్ మొనగాడు అంటూ ఓ రేంజ్ లో అతడిని లేపుతున్నారు. వెస్టిండీస్ పైన రెండో టెస్టులో విజయం సాధించిన నేపథ్యంలో… వరల్డ్ కప్ గెలిచినట్లుగా ఫీల్ అయిపోతున్నారు. బాబర్ ఆజం ఒక్కడే.. జట్టును ముందుండి గెలిపించాడని ఫోజులు కొడుతున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ అజర్ అలీ ( Azhar Ali ) కూడా బాబర్ ఆజం (Babar Azam) కెప్టెన్సీ పై ప్రశంసల వర్షం కురిపించారు. పాత బాబర్ ఆజం బయటకు వచ్చాడని.. ఇక పాకిస్తాన్ కు మంచి రోజులు రావడం గ్యారెంటీ అని తెలిపారు.

పాత బాబ‌ర్ ను నిద్ర‌లేపారు..ఇక టీమిండియా రోజులు లెక్క‌ పెట్టుకోవాల్సిందే

వెస్టిండీస్ జట్టును చిత్తు చేసిన కెప్టెన్ బాబర్ ఆజం పైన సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తున్న నేపథ్యంలో మాజీ కెప్టెన్ అజర్ అలీ కూడా తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. దాదాపు రెండు సంవత్సరాలుగా బాబర్ ఆజం ఫ్లాఫ్ అవుతు వస్తున్నాడని వెల్లడించారు. కానీ పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ నుంచి.. బాబర్ ప్రదర్శన మెరుగైందని పేర్కొన్నారు. ఇక వెస్టిండీస్ గడ్డపై అతడి ఆట అద్భుతమన్నారు. పాత బాబర్ ఆజం ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చాడని ప్రశంసించారు. ఇక పాత బాబర్ ఆజం బయటకు వచ్చిన నేపథ్యంలో… పాకిస్తాన్ జట్టును తట్టుకోవడం కష్టమేనని తెలిపారు. ప్రత్యర్థి జట్టుకు నరకం చూపిస్తాడని హెచ్చరించారు. కెప్టెన్ గానే కాకుండా బ్యాటర్ గా కూడా బాబర్ ఆజం చాలా మెరుగయ్యాడు అంటూ ప్రశంసించారు. ఇదే ఊపుతో టీమిండియాను కూడా బాబర్ ఆజం మట్టి కరిపిస్తాడని తెలిపారు.

Advertisement

Ishant Sharma On MS Dhoni : ధోని మాములోడు కాదు భ‌య్యా…కోహ్లీని, న‌న్ను బండ‌బూతులు తిట్టాడు

రాసి పెట్టుకోండి..వరుసగా 5 వ‌ర‌ల్డ్ క‌ప్పులు పాక్ గెలుస్తుంది!

చాలా రోజులుగా వరుసగా టీమిండియా ట్రోఫీలు కొట్టడం చూస్తున్నామని.. ఇకపై అది జరగబోదని హెచ్చరించారు అజర్ అలీ. భవిష్యత్తులో వరుసగా ఐదు వరల్డ్ కప్ లు పాకిస్తాన్ గెలవడం చూస్తానన్నారు. ఈ ఐదు టైటిల్స్ కూడా బాబర్ ఆజం చేతుల మీదుగా పాకిస్తాన్ అందుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. పాత బాబర్ తెరపైకి వచ్చిన నేపథ్యంలో టీమిండియా జట్టుకు గడ్డుకాలం షురూ అయినట్లేనని వెల్లడించారు. ఇంకా టీమిండియా ఆటలు సాగబోవని హెచ్చరించారు. ఐసీసీ టోర్నమెంట్లో భాగంగా ఇండియా తో మ్యాచ్లు జరిగితే.. ప్రతి దాంట్లో పాకిస్తాన్ గెలవడం గ్యారెంటీ అని శపథం చేశారు. వచ్చే 2027 వన్డే వరల్డ్ కప్ సమయంలో కూడా పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మధ్య మూడు మ్యాచ్లు జరుగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కచ్చితంగా టీమిండియాను ఓడించి బాబర్ ప్రతీకారం తీర్చుకుంటాడని తనకు నమ్మకం ఉందన్నారు.

Advertisement

Major Gaurav Arya On Pak: పాకిస్తాన్ క్రికెట‌ర్లు గాడిద‌ల్లాంటివాళ్లు…అభిషేక్ గురించి మాట్లాడే హ‌క్కే లేదు

Related News

ఆ ఇద్దరూ దరిద్రుల వల్ల, నాకు నిద్ర పట్టడం లేదు…గంభీర్ కామెంట్స్ వైరల్

నీ కోసం ప్రైవేట్ జెట్ పంపిస్తా… మార్క్ వుడ్ కు ఐపీఎల్ ఓన‌ర్ క‌ళ్లు చెదిరే ఆఫర్

విదేశాల్లో ఒక్క‌ ఐపీఎల్ మ్యాచ్‌ పెట్టండి..టీమిండియా ప్లేయ‌ర్ల‌ భాగోతం బ‌య‌ట‌ప‌డుతుంది

ఆ రోజు జెర్సీ విడిచినందుకు, నా కూతురే అవ‌మానించింది…గంగూలీ ఎమోష‌న‌ల్

బాబర్ ఆజం మ‌గాడే కాదు, పెద్ద మాడా గాడు… వాడి కంటే, ఫాతిమా సనా 200% బెటర్

బీసీసీఐ త‌ల‌తిక్క నిర్ణ‌యాల‌ వ‌ల్లే… అభిషేక్ శర్మ, వైభవ్ కెరీర్ నాశ‌నం అవుతోంది!

ఏషియన్ గేమ్స్ లో టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టి, ఘోరంగా ఓడిస్తాం

దిండుపై పడుకుని బుమ్రా రిలాక్స్…మీకు పని పాట లేదంటూ పరువు తీసిన సంజనా గణేశన్

Big Stories

Advertisement
×