Korean Kanakaraju Box Office:ఒకటి రెండు కాదు.. ఆపరేషన్ వాలంటైన్, గాండీవ దారి అర్జున, మట్కా.. ముచ్చటగా మూడు అట్టర్ ప్లాపులు.ఒకదానికి మించి ఒకటి బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేసినవే.
దీంతో ఈసారి ఎలాగైనా హిట్టు కొట్టాలంటూ కామెడీ సినిమాలకి పెట్టింది పేరైన మేర్లపాక గాంధితో ‘కొరియన్ కనకరాజు’ సినిమా కోసం జట్టు కట్టాడు వరుణ్ తేజ్.ఇక ఈ సినిమా ఆగస్టు 7న అంటే నిన్న థియేటర్లోకి వచ్చేసింది.
ఇక సినిమాకి మొదటి షో నుంచే మంచి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద సినిమా సాలిడ్ కొట్టేలానే కనిపిస్తుంది.
ఇక ‘కొరియన్ కనకరాజు’ ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తే వరల్డ్ వైడ్‌గా ప్రీమియర్స్‌తో కలిపి, మొదటి రోజే ఏకంగా 10.20 కోట్లకు పైగా గ్రాస్ వేనేకేసినట్టు తెలుస్తుంది.ఒక రకంగా ఇది వరుణ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని చెప్పాలి.
ముఖ్యంగా సినిమా కి ముందు వేసిన ప్రీమియర్ షోలు, రిలీజ్ అయిన మొదటి రోజున భారీ వసూళ్లని తెచ్చేందుకు ఉపయోగపడ్డాయని చెప్పాలి.
సాధారణంగా హర్రర్ సినిమాలకి మొదటి రోజు చాలా కీలకమంటారు. అలాంటిది ‘కొరియన్ కనకరాజు’కి మొదటి రోజే మంచిగా ఉందన్న పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి.
ఇక ఈ సినిమాలో హర్రర్ సీన్స్ కంటే కామెడీ సీన్స్ బాగా పేలాయని ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్న టాక్ కథలో హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ వాటికి మించి కామెడీ బాగా వర్కౌట్ అయిందని వినిపిస్తుంది.ముఖ్యంగా సత్య చేసిన కామెడీ థియేటర్లో నవ్వుల వర్షం కురిపిస్తుంది.
ఇక వరుణ్ తేజ్ కూడా తన గత సినిమాల కంటే ఇందులో కొత్తగా కనిపించాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇక మా మెగా ప్రిన్స్ హిట్టు కొట్టాడోచ్ అంటూ మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్.
ఇక మొదటి రోజు ఇలా ఉంటే రెండో రోజు కూడా సినిమా కి సాలిడ్‌గా అడ్వాన్స్ బుకింగ్ జరిగినట్టు తెలుస్తోంది.బుక్ మై షో, డిస్ట్రిక్ట్ వంటి యాప్స్ కలిసి ఇప్పటికే రెండు పాయింట్ ఐదు లక్షల పైగా టికెట్స్ సోల్డ్ అయినట్టు సమాచారం.అంటే మొదటి రోజు టాక్‌తో ఆగిపోకుండా, రెండో రోజుకు కూడా ప్రేక్షకులు థియేటర్లకి క్యూ కట్టేస్తున్నారు అన్నమాట.
ఇక వీకెండ్ శని, ఆదివారాలు కావడంతో ‘కొరియన్ కనకరాజు’ మరిన్ని కలెక్షన్స్‌ని వెనకేసేలానే కనిపిస్తున్నాడు.ఇక ఇండియాలోనే కాకుండా అటు ఓవర్సీస్‌లోను ‘కొరియన్ కనకరాజు’కి మంచి రెస్పాన్స్ దక్కడం విశేషం.
ఇక నార్త్ అమెరికాలో ఇప్పటికే లక్ష 75,000 పైగా గ్రాస్ దాటినట్టు సమాచారం.ఈ వసూళ్లని చూస్తుంటే ముందు ముందు అక్కడ కూడా ఈ సినిమా మంచి నెంబర్స్‌ని రాబట్టేలా కనిపిస్తుంది.
మరోవైపు ఆగస్టు 10న బోనాల పండుగ ఉండటంతో లాంగ్ వీకెండ్ కూడా కలిసి వచ్చేలానే కనిపిస్తుంది.ఇక ఈ టాక్ ఇలాగే కంటిన్యూ అయి జోరు చూపిస్తే ‘కొరియన్ కనకరాజు’ 100 కోట్ల క్లబ్‌లో కూర్చున్న ఆశ్చర్యం లేదు.
ALSO READ:సామ్ లైఫ్‌లో కొత్త చాప్టర్.. బేబీ కోసం ఇప్పటి నుంచే ప్రిపేర్!
మొత్తానికి వరుస ప్లాఫ్‌లతో డీలపడ్డ వరుణ్ తేజ్‌కి ‘కొరియన్ కనకరాజు’ కొత్త ఊపిరి పోసాడు అని చెప్పాలి.చూడాలి మరి వసూళ్లలో కనిపిస్తున్న ఈ జోరు ఎక్కడ దాకా వెళ్తుందో.. వరుణ్ తేజ్ కెరీర్‌లో బిగ్గెస్ట్‌గా నిలుస్తుందో లేదో కాలమే డిసైడ్ చేయాలి!