BigTV English

Oil Tanker Accident: ఆయిల్ ట్యాంకర్ బీభత్సం.. నలుగురు మృతి

Oil Tanker Accident: ఆయిల్ ట్యాంకర్ బీభత్సం.. నలుగురు మృతి

Odisha Ganjam Road Accident: ఒడిశాలోని గంజాం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు మరణించారు. ప్రయాణికలతో వెళ్తున్న బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టి.. ఆ పక్కనే ఉన్న టీ స్టాల్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 20 మంది గాయపడ్డారు.


ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భంజన్ జాగర్ నుంచి బెర్హంపూర్ కు 50 మంది ప్రయాణికులతో బస్సు వెళ్తోంది. మార్గం మధ్యలో సంబర్ జోల్ లోని కంజూరు చౌరస్తా సమీపంలో ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్ బస్సును ఢీ కొట్టింది. ముందు ఉన్న ట్రక్కును ఓవర్ టేక్ చేయాలని ప్రయత్నించిన ట్యాంకర్ డ్రైవర్.. వాహనంపై పట్టు కోల్పోవడంతో.. అది టీ స్టాల్ లోకి దూసుకెళ్లింది.

Also Read: బీహార్‌లో ఆర్‌జేడీ నేత దారుణ హత్య


ఆ సమయంలో అక్కడ టీ తాగుతున్న ఇద్దరు వ్యక్తులు ట్యాంకర్ చక్రాల కిందపడి మరణించారు. మరో ఇద్దరు కూడా ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే.. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొందరు తీవ్రంగా గాయపడగా.. వారిని MKCG మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×