BigTV English

Bandi Sanjay open offer: సీఎం రేవంత్ కు బండి సంజయ్ భారీ ఆఫర్

Bandi Sanjay open offer: సీఎం రేవంత్ కు బండి సంజయ్ భారీ ఆఫర్

Central deputy home minister Bandi Sanjay open offer to cm Revanth Reddy for join bjp: తెలంగాణలో మాటల యుద్ధం జరుగుతోంది. బీఆర్ఎస్ నేతలకు తోడు బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ సీఎంపై విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ కు కౌంటర్ గా కేటీఆర్ రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం తథ్యం అని ప్రతి విమర్శ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పరోక్షంగా కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మోదీ సిద్ధాంతాలను పాటించడానికి ఒప్పుకుని ..స్వచ్ఛందంగా బీజేపీలో చేరేవారెవరికైనా తమ పార్టీ రెడ్ కార్పెట్ వేస్తుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ని బీజేపీలోకి చేర్చుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అన్నారు.


అభిషేక్ మను సింఘ్వీకి కాంగ్రెస్ టిక్కెట్ అందుకే

కేసీఆర్ ఆదేశాలతోనే కవిత కేసును ఢిల్లీలో విచారిస్తున్న అభిషేక్ మను సింఘ్వీకి కాంగ్రెస్ టిక్కెట్ ఇచ్చిందని..దీనికి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని బండి సంజయ్ ప్రశ్నిస్తున్నారు. దీనిని బట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకటే అని తెలుస్తోందని అన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం ప్రక్రియ ఊపందుకోనుందని ..అది దగ్గరలోనే ఉందని అన్నారు. 39 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న బీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిని కేవలం కాంగ్రెస్ కోసం త్యాగం చేసే పరిస్థితి కనిపిస్తోందని ..కనీసం ఒక్కరినైనా గెలిపించుకునే ఛాన్స్ ఉన్నా దానిని కాంగ్రెస్ వారి కోసం వదిలేసుకుంటున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ఇటీవల బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నారని..ముందుగా బీఆర్ఎస్ నేతలపై ఉన్న కేసులన్నీ పరిష్కరించుకోవాలని..కాంగ్రెస్ కు ప్రతిఫలంగా బీఆర్ఎస్ పనిచేయాలని భావిస్తోంది.


విగ్రహ రాజకీయాలా?

ఒక పక్క రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అందక రైతులు కొట్టుమిట్టాడుతుంటే విగ్రహ రాజకీయాలను చేస్తూ రెండు పార్టీలు టాపిక్ ను డైవర్ట్ చేస్తున్నాయన్నారు. విగ్రహాలు పెట్టే టప్పుడు రాజీవ్ గాంధీ, కేసీఆర్ విగ్రహాలతో పాటు వాజ్ పేయి విగ్రహాన్ని కూడా నెలకొల్పాలని డిమాండ్ చేశారు. హైడ్రా పేరిట బడా నేతల జోలికి వెళ్లకుండా కేవలం చోటా నేతల అక్రమ నిర్మాణాలు కూలగొడుతూ హైడ్రామా ఆడుతున్నారని కాంగ్రెస్ సర్కార్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు బండి సంజయ్.

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×