BigTV English

Nano Banana AI Scam: నానో బనానాతో రూ.70 వేలు పాయే.. వీసీ సజ్జనార్ షాకింగ్ కామెంట్స్!

Nano Banana AI Scam: నానో బనానాతో రూ.70 వేలు పాయే.. వీసీ సజ్జనార్ షాకింగ్ కామెంట్స్!

Sajjanar On AI Nano Banana Scam:

గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నానో బనానా ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. గూగుల్ జెమిని ఏఐ టూల్ సాయంతో నెటిజన్లు అదిరిపోయే ఫోటోలను క్రియేట్ చేసుకుంటున్నారు. అంత వరకు బాగానే ఉన్నా, ఈ టూల్ కారణంగా కొంత మంది డబ్బులు పోగొట్టుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తాజాగా రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఈ ఫోటోలు ట్రై చేసి, తన అకౌంట్ లోని రూ. 70 వేలను పోగొట్టుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


‘నానో బనానా’ వ్యవహారంపై స్పందించిన సజ్జనార్

అటు ‘నానో బనానా’ వ్యవహారంపై ఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ స్పందించారు. ఇలాంటి ట్రెండింగ్ యాప్స్ ను నమ్ముకుంటే బలికాక తప్పదన్నారు. “ఇంటర్నెట్‌లో ట్రెండింగ్ లతో జాగ్రత్త! ‘నానో బనానా’ ట్రెండింగ్ మాయలో పడి.. వ్యక్తిగత సమాచారాన్ని ఇంటర్నెట్ లో కుమ్మరిస్తే ఇలాంటి మోసాలే జరుగుతాయి. ఒక్క క్లిక్‌తోనే బ్యాంక్ ఖాతాల్లో ఉన్న డబ్బు నేరగాళ్ల చేతుల్లోకి పోతుంది. ఫేక్ వెబ్‌ సైట్లు, అనధికార యాప్‌లకు ఫోటోలు/వ్యక్తిగత వివరాలను అసలే ఇవ్వొద్దు.  సోషల్ మీడియా ట్రెండింగ్ ల్లో మీ ఆనంద క్షణాలను పంచుకోవచ్చు కానీ.. భద్రతే మొదటి ప్రాధాన్యమనే విషయం మరిచిపోవద్దు! చూడని దారిలో అడుగేస్తే గుంటలో పడటం ఖాయం.. మీ ఫోటోలు, వ్యక్తిగత సమాచారాన్ని అప్లోడ్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ఈ ట్రెండింగ్ లు కొన్ని రోజులే వచ్చి హల్ చల్ చేసి వెళ్లిపోతాయి.. ఒక్కసారి ఫేక్ వెబ్‌సైట్‌లు, అనధికార యాప్‌లకు వెళ్లిన మీ డేటాను తిరిగి వెనక్కి తీసుకురావడం కష్టం.
గుర్తుపెట్టుకోండి.. మీ డేటా, మీ డబ్బు,  మీ బాధ్యత” అంటూ రాసుకొచ్చాడు.


ఇంతకీ ఏంటీ నానో బనానా మోసం కథ?

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌ కు చెందిన ఓ యువకుడు.. తాజాగా గూగుల్ జెమినిలో తయారు చేసే నానో బనానా ఫోటోలకు బాగా అట్రాక్ట్ అయ్యాడు. చాలా మంది తమ ఫోటోలను ఈ టూల్ లో ఎడిట్ చేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేయడం చూశాడు. అతడు కూడా తన ఫోటోలను అలాగే క్రియేట్ చేయాలనుకున్నాడు. అందరి లాగే సోషల్ మీడియాలో షేర్ చేయాలనుకున్నాడు. సోషల్ మీడియాలోని ఇమేజ్‌ ఎడిటర్‌ యాప్‌ లింకును ఓపెన్ చేశాడు. తన ఫొటోను త్రీడీలో క్రియేట్ చేసుకున్నాడు. కాసేపటి తర్వాత ఒక్కసారిగా షాకయ్యాడు. కారణం తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 70 వేలు మాయం అయ్యాయి. వెంటనే తాను మోసపోయానని గ్రహించాడు. వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అతడి డబ్బులు వెనక్కి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి యాప్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Read Also: ప్రెగ్నెన్సీ టెస్టులో మగాడికి పాజిటివ్.. ఇలా కూడా వస్తుందా?

Related News

Mahabubabad News: ఇన్ స్టా లవ్.. అర్ధరాత్రి ఏకంగా భర్తను చంపబోయింది.. చివరకు?

Nalgonda Crime News: మైనర్ పై అత్యాచారం.. నిందితుడికి 22 ఏళ్ళు జైలు శిక్ష..

Rushikonda Beach Tragedy: రుషికొండ తీరంలో విషాదం.. సముద్రంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

ORR Car Incident: ఔటర్ పై కారు పల్టీ.. స్పాట్‌లో లేడీ సాప్ట్ వేర్ మృతి

Tirupati Crime: తిరుపతిలో దారుణం.. కుళ్లిపోయిన స్థితిలో మృతదేహాలు..

Husband Attacks Wife: పెళ్లయి ఏడాది.. ఫంక్షన్‌కి వెళ్దామంటే.. భార్య గొంతు కోసి

Mahabubnagar: దారుణం.. కన్న కొడుకును కర్రతో కొట్టి చంపిన తండ్రి..

Big Stories

×