E-Paper
Advertisement

Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వరుసగా ఢీకొన్న మూడు వాహనాలు.. స్పాట్ లో 13 మంది!

Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వరుసగా ఢీకొన్న మూడు వాహనాలు.. స్పాట్ లో  13 మంది!
Advertisement

Road Accident: ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొనకమిట్ల మండలం చిన్నారికట్ల గ్రామ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, సుమారు 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

పూర్తి సమాచారంలోకి వెళితే.. అయితే రహదారి పక్కన నిలిపి ఉంచిన ఒక మినీ లారీని వెనుక నుంచి వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా, అదే సమయంలో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు కూడా ముందరి ప్రైవేట్ బస్సును వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. వరుసగా మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో వాహనాల ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

Advertisement

Also Read: శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో సంచలనం.. 600 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్!

గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతివేగం, తెల్లవారుజామున ఉండే మంచు కారణంగా ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×