E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ని ఢీ కొట్టిన కారు, టెక్కీ సహా 13 మంది మృతి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ని ఢీ కొట్టిన కారు, టెక్కీ సహా 13 మంది మృతి
Advertisement

Road Accident: అతివేగమే ప్రమాదానికి కారణం పదే పదే పోలీసులు వాహనదారులను హెచ్చరిస్తున్నారు. అయినా వాహనాదారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.  తాజాగా చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కంటైనర్‌ని కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో టెక్కీ సహా ఆరుగురు మృతి చెందారు.

చిత్తూరు-బెంగళూరు గ్రామీణ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

శుక్రవారం ఉదయం చిత్తూరు శివారులోని ఇరువారం సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్‌ని ఓ కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదం స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. అంతేకాదు కంటైనర్ కిందకు కారు దూసుకుపోయింది.

దీంతో కారు లోపల ఉన్నవారు బయటకు రావడానికి అవకాశం లేకుండాపోయింది. ఘటన సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. వారంతా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గ్యాస్ కట్టర్ల సాయంతో కారుని కట్ చేశారు.

Advertisement

టెక్కీ సహా 13 మంది మృతి, కంటైనర్‌ని ఢీ కొట్టిన కారు

ఆ తర్వాత అందులోని మృతదేహాలను ఒకొక్కటిగా బయటకు తీసుకొచ్చారు. మృతుల్లో ఓ టెక్కీ కూడా ఉన్నాడు. గుడిపాల మండలం రామాపురానికి చెందిన అనుదీప్ మృతి చెందాడు. అతడు సాప్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు.

మరోవైపు కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ఏడుగురు మృతి చెందారు. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని హోస్పేట శివార్లలో శుక్రవారం తెల్లవారుజామున కార్లు, క్యాంటర్, బైక్ ఢీ కొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోస్కోట-దాబాస్పేట జాతీయ రహదారిపై హోస్కోట్ నుండి దేవనహళ్లి వైపు వెళ్తున్న XUV 700 కారు ముందుగా వెళ్తున్న మోటార్ సైకిల్‌ను ఢీకొట్టింది.

ALSO READ: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన భవనం

ఆ తర్వాత కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి కాంటర్ వాహనాన్ని ఢీ కొట్టాడు. స్పాట్ లో ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో XUV కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు, బైక్ రైడర్ మరణించారు. మృతులు బెంగళూరులోని కొత్తనూర్ ప్రాంతానికి చెందినవారుగా తెలుస్తోంది. మృతదేహాలను హోస్కోట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×