E-Paper
Advertisement

Municipal Election Results 2026 : మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ.. గెలుస్తామా? లేదా? అనే ఆందోళన!

Municipal Election Results 2026 : మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ.. గెలుస్తామా? లేదా? అనే ఆందోళన!

Municipal Election Results 2026: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల్లో లబ్ డబ్ నెలకొంది. గెలుస్తామా? లేదా? ఓటర్లు ఎటు ఓటు వేశారు.. ఫలితం ఎలా వస్తుందో.. లక్షలు ఖర్చుచేశాం.. ఎలా తీరుతాయనేది ఇప్పుడు వారిలో ఆందోళన స్టార్ట్ అయింది. కాలనీలవారీగా ఓటర్ లిస్టు, పోలైన ఓట్లతో బేరీజు వేసుకుంటూ సన్నిహితులతో చర్చిస్తున్నారు. పైకి గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తూనే లోలోన ఆందోళన చెందుతున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో అయితే ముందస్తుగానే క్యాంపురాజకీయాలకు తెరదీశారు.

అభ్యర్థుల్లో ఉత్కంఠ

రాష్ట్రంలో 116 మున్సిపాలిటీ, 7 కార్పొరేషన్లలోని 2996 వార్డులు/డివిజన్లకు ఎన్నికలు ఈ నెల 11న పోలింగ్ జరిగింది. నేడు(శుక్రవారం) ఫలితాలు వెలువడనున్నాయి. అయితే మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ నెలకొంది. పోటీ చేసిన అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. వార్డులేదా డివిజన్లలో ఉన్న కాలనీలవారీగా పోటీచేసిన అభ్యర్థులు ఓటర్ల లిస్టులతో లెక్కలు వేసుకుంటున్నారు. ఆ వార్డులోని పార్టీ కీలక నేతలతో గురువారం మొత్తం ఆరా తీశారు. ఏ వర్గం, ఏ కులం ఓట్లు పడ్డాయి.. ఇతర పార్టీలకు ఎవరి ఓట్లు పడ్డాయి.. మనకు గెలుపుకోసం కలిసి వచ్చే అంశాలు ఏంటనేది చర్చించారు. అంతేకాదు ఇతర వార్డుల్లోని నేతలతో పోలైన ఓట్లపై ఆరా తీశారు. సర్వేల్లో ఏం రిపోర్టు వచ్చింది..నిజంగానే తమకు అనుకూలంగా ఉన్నాదా లేదా? అనే వివరాల్లో నిమగ్నమయ్యారు. శుక్రవారం ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభం కానుండటంతో పోటీచేసిన అభ్యర్థులు లోలోన గుబులు పడుతున్నారు. 10రోజులకు పైగా ప్రచారం చేయడం, అప్పులు చేసి మరీ ఎన్నికల్లో ఖర్చుపెట్టుకున్న పరిస్థితి. అయితే గెలిస్తేనే తాము రాజకీయంగా, ఆర్థికంగా నిలదొక్కుకుంటామని లేకుంటే తమ భవిష్యత్ ఇబ్బందుల పాలువుతుందని ఆందోళన స్టార్ట్ అయింది.

Also Read:  Hyderabad: హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన భవనం.. స్పాట్ లో ఐదుగురు

తమను ఓటర్లు విశ్వసించారా? లేదా?

ఒక్కో ఓటుకు సుమారు 3వేలవరకు అభ్యర్థులు ఖర్చు చేశారు. ప్రచార ఖర్చును సైతం భారీగా చేశారు. అయితే తమను ఓటర్లు విశ్వసించారా? లేదా? అనేది చర్చనేతల్లో చర్చకు దారితీసింది. గడగడపకు తిరిగినా ఏమేరకు ఫలితం ఇస్తుంది..తమ పరిస్థితి ఏంటనేది లోలోన మధనపడుతున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే వీటికి తోడు ఎంఐఎం, ఏఐఎఫ్బీ, సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలు సైతం కొన్ని వార్డుల్లో గట్టిపోటీ ఇచ్చాయి. ఈ పార్టీల ప్రభావం ప్రధానపార్టీల గెలుపోటములపై పడే అవకాశం ఉందని పోటీచేసిన అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. తమకు పడే ఓట్లు ఆపార్టీల అభిమానం, ఆ నేతలపై అభిమానంతో వేస్తే తమకు ఎఫెక్టు పడనుందని సన్నిహితులతో చర్చించుకుంటున్నారు.

క్యాంపు రాజకీయం షురూ

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనుండటం, పోటీపోటీగా ఎన్నికలు జరుగడంతో తమ అభ్యర్థులు చేజారకుండా కాపాడుకునేందుకు ప్రధానపార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరదీశారు. ముందస్తుగానే చైర్మన్, వైస్ చైర్మన్ కోసం సంప్రదింపులు సైతం మొదలయ్యాయి. పదవులు ఆశిస్తున్న వారు క్యాంపులకు అయ్యే ఖర్చులను భరించేందుకు ముందుకు వచ్చారు. తమపార్టీల అభ్యర్థులను క్యాంపులకు తీసుకెళ్లారు. వేములవాడలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అభ్యర్థులు కుటుంబ సభ్యులతో కలిసి క్యాంపు రాజకీయాలకు వెళ్లారు. నిజామాబాద్ మున్సిపల్ కు చెందిన బీజేపీ అభ్యర్థులు సైతం క్యాంపునకు వెళ్లారు. అదే విధంగా నిర్మల్ లో సైతం బీజేపీ మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతుంది. పోటీచేసిన అభ్యర్థులను క్యాంపునకు తరలించారు. ఇలా పలు మున్సిపాలిటీలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులను ఆపార్టీలు క్యాంపునకు తీసుకెళ్లాయి. ప్రమాణస్వీకారం రోజూ క్యాంపునుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారు. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నుకోనున్నారు. ఏది ఏమైనా ఫలితాలు ఎలా వస్తాయోనని అభ్యర్థుల్లో మాత్రం ఉత్కంఠ నెలకొంది.

బెట్టింగ్ లు

మున్సిపాలిటీల్లో ఎన్ని వార్డులను ఏ పార్టీ గెలుచుకుంటుంది.. ఏ పార్టీ ఎన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుంది.. ఏ వార్డులో ఎవరు గెలుస్తారనేదానిపై బెట్టింగులు జోరందుకున్నాయి. కొన్ని వార్డుల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నెలకొంది. కొత్తగూడెంలో మాత్రం కాంగ్రెస్ వర్సెస్ సీపీఐ గా మారింది. భైంసాలో మాత్రం బీజేపీ వర్సెస్ ఎంఐఎం గా పోటాపోటీ నెలకొంది. దీంతో ఎవరు గెలుస్తారనేదానిపై బెట్టింగులు నడుస్తున్నాయి. లక్షల రూపాయల్లో బెట్టింగ్ చేస్తున్నట్లు సమాచారం.

Also Read: Karthikeya Wife: గుడ్ న్యూస్ చెప్పిన హీరో కార్తికేయ వైఫ్.. కంగ్రాట్స్ చెబుతున్న ఫ్యాన్స్!

Related News

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

రైతులకు జూన్ 2 కానుక మిస్!: పనులన్నీ పూర్తి చేసినా సాంకేతిక అడ్డంకులు!

Big Stories

×