E-Paper
Advertisement

Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కింద పడి 11 ఏళ్ల బాలుడు మృతి..

Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కింద పడి 11 ఏళ్ల బాలుడు మృతి..
Advertisement

Road Accident: నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం, రాముడుపాలెం వద్ద ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు అన్నదమ్ములు సైకిల్‌పై పాఠశాలకు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టైరు కింద పడి ఆరో తరగతి చదువుతున్న 11 ఏళ్ల పులి కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

అయితే ఈ ఘటనలో సైకిల్‌పై ప్రయాణిస్తున్న ఆ ఇద్దరు అన్నదమ్ములలో సైకిల్ ముందువైపు తొక్కుతున్న తమ్ముడు అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో.. ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, సైకిల్ వెనుక వైపు కూర్చున్న అన్న కిరణ్ (11) మాత్రం బస్సు చక్రాల కింద పడి దుర్మరణం చెందాడు. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలో అన్నదమ్ముల్లో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు స్వల్ప గాయాలతో బయటపడటం కుటుంబ సభ్యులకు తీరని బాధను మిగిల్చింది. అంతేకాకుండా గతంలోనే ఈ చిన్నారుల తండ్రి పులి మురళి కరెంట్ షాక్‌తో మరణించాడు. ఒకే కుటుంబంలో వరుసగా రెండు విషాదాలు జరిగాయి. దీంతో వారి కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నారు.

Advertisement

ఈ ప్రమాదం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సైకిల్‌పై వస్తున్న బాలురను బస్సు డ్రైవర్ గమనించకపోవడం లేదా అతివేగం కారణంగా బస్సు అదుపు తప్పడం వలన ఈ ఘోరం జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపివేశాడు, అయితే అప్పటికే తీవ్ర గాయం కావడంతో బాలుడు కిరణ్‌ను కాపాడలేకపోయారు.

Also Read: పంచాయితీ ఎన్నికల వేళ హీటెక్కిన పల్లెలు.. రంగంలోకి నేతల అనుచరులు

Advertisement

స్థానికుల సమాచారంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆరా తీసి, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×