Prakasham District: ప్రకాశం జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. రంగారెడ్డిపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక డ్రైవర్ సజీవ దహనమయ్యారు. డ్రై ఫ్రూట్స్ లోడ్‌తో వెళ్తున్న డీసీఎంను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఈ దారుణం జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కాకినాడ నుంచి అనంతపురం వైపు డ్రై ఫ్రూట్స్‌ను తరలిస్తున్న డీసీఎం వాహనం.. ప్రకాశం జిల్లా రంగారెడ్డిపల్లి సమీపానికి రాగానే ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న గుర్తుతెలియని వాహనం డీసీఎంను బలంగా ఢీకొట్టింది. ఈ ధాటికి వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలు భారీగా వ్యాపించడంతో డ్రైవర్ వెర్రిస్వామి వాహనం లోపలే చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు. మృతుడు అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాగా, వాహనంలో ఉన్న మరో వ్యక్తి జయరామరెడ్డి తీవ్ర గాయాలతో బయటపడగా, స్థానికులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
Also Read: నూతన సంవత్సర కానుక.. నేడే ఏపీలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
రాచర్ల ఎస్సై కోటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. అయితే, ఇదే ప్రాంతంలో గతంలోనూ అనేక ప్రమాదాలు జరిగాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి-అనంతపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
రాచర్ల మండలం రంగారెడ్డిపల్లి గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనాన్ని ఢీ కొట్టిన డీసీఎం
డీసీఎంలో మంటలు చెలరేగి ఒకరు సజీవ దహనం, మరొకరికి తీవ్ర గాయాలు
మృతుడు అనంతపురం జిల్లాకు చెందిన వెర్రి స్వామిగా గుర్తింపు
గాయపడ్డ వ్యక్తి అనంతపురం… pic.twitter.com/nlBm08IZBW
— BIG TV Breaking News (@bigtvtelugu) December 31, 2025