E-Paper
Advertisement

Minister Pemmasani: కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్.. కఠినచర్యలు తప్పవు, ఈ పని ఎవరు చేశారు?

Minister Pemmasani: కేంద్రమంత్రి పెమ్మసాని వార్నింగ్.. కఠినచర్యలు తప్పవు, ఈ పని ఎవరు చేశారు?
Advertisement

Minister Pemmasani: తనపై లేనిపోని విధంగా తప్పుడు ప్రచారం చేసినవారికి సూటిగా  వార్నింగ్ ఇచ్చారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. భారత్‌లో తనకు ఎలాంటి లాజిస్టిక్స్ కంపెనీలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను ఏ కంపెనీలను నడపలేదన్నారు. ప్రొత్సహించలేదన్నారు. అలాగే మద్దతు ఇవ్వలేదని తేల్చిచెప్పేశారు. ఉన్నట్లుండి ఆయన ప్రకటన వెనుక ఏం జరిగింది? జరుగుతోంది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

కేంద్రమంత్రి పెమ్మసాని టార్గెట్‌గా కుట్రలు బయటకు

Advertisement

గుంటూరు నుంచి టీడీపీ ఎంపీగా గెలుపొందరు పెమ్మసాని చంద్రశేఖర్. ప్రస్తుతం మోదీ కేబినెట్‌లో ఆయన మంత్రిగా పని చేస్తున్నారు. ఇటీవల సదరు కేంద్రమంత్రి అమరావతిలో రైతుల సమస్యలపై ప్రధానంగా ఫోకస్ చేశారు. త్రీమెన్ కమిటీలో ఆయన సభ్యులు కూడా. అమరావతి రైతుల సమస్యలపై నేరుగా మాట్లాడుతున్నారు.  దీంతో  ప్రత్యర్థులు ఆయనపై తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు.

ఆ ప్రాంతంలో తిరుగుతున్న టిప్పర్ వాహనాలపై పెమ్మసాని అంటూ తాటికాయంత అక్షరాలు లారీపై కనిపించాయి. దీంతో ఆ టిప్పర్ లారీ ఫొటోలు పెట్టి పలువురు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. చివరకు ఈ వ్యవహారం కేంద్రమంత్రి పెమ్మసాని దృష్టి వచ్చింది.  దీనిపై ఆయన ఓ రేంజ్‌లో ఫైరయ్యారు.

Advertisement

సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పెమ్మసారి

సోషల్‌మీడియా వేదికగా కేందమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రియాక్ట్ అయ్యారు. తనకు రియల్ ఎస్టేట్, మైనింగ్, రవాణా లేదా అనుబంధ రంగాల్లో ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. ఎక్కడైనా ఆ తరహా ప్రచారం జరుగుతున్నా ప్రకటనలు, ఫోటోలు కనిపించినా పూర్తిగా అవాస్తమని తెలిపారు.

కేవలం ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటివి తన గౌరవం, ప్రతిష్ఠను దెబ్బతీయాలనే దురుద్దేశంతో చేసిన చర్యలుగా పరిగణించబడతాయని చెప్పారు. డాక్టర్ పెమ్మసాని అక్రమ లేదా అనైతిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వరని, సహించరని తేల్చిచెప్పారు. దయచేసి ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు.

ALSO READ:  ఏపీ ప్రజలను న్యూఇయర్ కానుక, ఒకరోజు ముందుగా పెన్షన్ల పంపిణీ

తన పేరును అనధికారికంగా వినియోగించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు ఆ తరహా తప్పుడు లేదా మోసపూరిత సమాచారాన్ని ఎవరైనా గమనిస్తే తక్షణం మా కార్యాలయానికి తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

ఉన్నట్లుండి కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై ఎవరు ఆ తరహా ప్రచారం చేస్తున్నారు? దీని వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు పలువురు రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు.  గుంటూరు అభివృద్ధి విషయంలో సదరు మంత్రి దగ్గరుండి చూస్తున్నారని అంటున్నారు.  ఈ విషయంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు నేరుగా వాహనాలపై ఆయన పేరు రావడంతో అలర్ట్ అయ్యారు. రానున్న రోజుల్లో ఈ వ్యవహారం గురించి ఇంకెన్ని కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×