E-Paper
Advertisement

Road Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

Road Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి
Advertisement

Road Accident: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉన్నవ్‌ జిల్లాలో ఓ లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా..మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు.

జమల్దిపూర్‌ గ్రామ సమీపంలోని హర్దోయ్‌-ఉన్నవ్‌ రహదారిపై వేగంగా వచ్చిన ఓ లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వారిని కాన్పూర్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.

Advertisement

Also Read: ఏడాది క్రితం మిస్సైన మోడల్ డెడ్ బాడీ లభ్యం.. అసలేం జరిగింది ?

ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం తర్వాత బస్సు డ్రైవర్‌ పరారయ్యాడని చెప్పారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×