Big Stories

Model Deadbody : ఏడాది క్రితం మిస్సైన మోడల్ డెడ్ బాడీ లభ్యం.. అసలేం జరిగింది ?

Missed Model Deadbody found in Morgue : బహ్రెయిన్ లో ఏడాది క్రితం మిస్సైన థాయ్ మోడల్ కైకన్ కెన్నకం (31) మృతదేహం తాజాగా బహ్రెయిన్ మోర్గ్ లో లభ్యమైంది. మృతదేహం మిస్సవ్వడం వెనుక ఉన్న అసలు విషయం ఏంటో దర్యాప్తు చేసి చెప్పాలని ఆమె కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జాతీయ మీడియా కథనాల్లో పేర్కొంది.

- Advertisement -

మోడల్ గా రాణించిన కైకన్.. అవకాశాలు తగ్గిపోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు ఒక రెస్టారెంట్ లో పనిచేసింది. ప్రతిరోజూ తన కుటుంబంతో మాట్లాడే కైకన్.. ఏం జరిగిందో ప్రతి విషయాన్ని పంచుకునేది. బహ్రెయిన్ లో తనకొక అబ్బాయి పరిచయం అయ్యాడని, అతనితో ప్రేమలో ఉన్న విషయాన్ని కూడా కుటుంబ సభ్యులకు తెలిపింది. అలాగే.. సోషల్ మీడియాలోనూ ప్రతి విషయాన్ని పంచుకునేది.

- Advertisement -

గతేడాది ఏప్రిల్ నుంచి కైకన్ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టులు ఆగిపోయాయి. దాంతో ఆమెకు ఏం జరిగిందోనని కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. ఈ ఏడాది జనవరిలో కైకన్ ఆచూకీ కనుగొనేందుకు థాయ్ రాయబార కార్యాలయం నుంచి సహాయం కోరింది. ఈ ఏడాది ఏప్రిల్ 18న బహ్రెయిన్ లోని థాయ్ రాయబార కార్యాలయం.. ఏడాది కాలంగా మనామాలోని సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ మార్చురీలో గుర్తుతెలియని ఆగ్నేయాసియా మహిళ మృతదేహం ఉందని, అది కైకన్ ది కావొచ్చన్న అనుమానం వ్యక్తం చేసింది.

Also Read : కరెంట్ బిల్లుపై గొడవ.. మహిళా టెక్నీషియన్ ను చంపిన వ్యక్తి

కైకన్ కాలుమీద ఉన్న టాటూ ఆధారంగా.. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. ఆల్కహాల్ లో విషం కలిపి తాగడం ద్వారా కైకన్ ఊపిరితిత్తులు, గుండె ఫెయిలై మరణించినట్లు వైద్యులు పోస్టుమార్టం రిపోర్ట్ లో పేర్కొన్నారు. కైకన్ మృతదేహాన్ని థాయ్ లాండ్ కు పంపాలని కుటుంబ సభ్యులు కోరారు. కానీ.. అందుకు ఖర్చు ఎక్కువగా అవుతుందని రాయబార కార్యాలయం తెలిపింది.

కైకన్ మృతిపై ఆమె సోదరి అనుమానం వ్యక్తం చేశారు. ఆల్కహాల్ లో విషం కలవడంతో మరణించిందని చెబుతున్నారు కానీ.. ఆమె మృతదేహంపై గాయాలున్నట్లు గుర్తించామన్నారు. అరబ్ దేశానికి చెందిన వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు చెప్పిందని, అతడిని విచారించాలని డిమాండ్ చేసింది. మృతదేహానికి మళ్లీ పోస్టుమార్టమ్ చేసి.. కేసు రీ ఓపెన్ చేసి విచారణలు నిజాలేంటో తెలుసుకోవాలని అధికారులను కోరారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News