BigTV English

Singareni Recruitment 2024: సింగరేణి సంస్థలో 327 ఉద్యోగాలు.. దరఖాస్తు తేదీల్లో మార్పు

Singareni Recruitment 2024: సింగరేణి సంస్థలో 327 ఉద్యోగాలు.. దరఖాస్తు తేదీల్లో మార్పు

Singareni Recruitment 2024: నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. ఇటీవలే సింగరేణి సంస్థలో 327 పోస్టుల భర్తీని నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియపై అధికారులు కీలక ప్రకటన చేశారు.


సింగరేణి సంస్థ 327 పోస్టుల భర్తీకి మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టుల భర్తీకి మొదట ఏప్రిల్ 15 నుంచి మే 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే కొన్ని అనివార్యకారణాల వలన దరఖాస్తు ప్రక్రియ వాయిదా వేసినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు.

గతంలో వెల్లడించిన తేదీలను కాదని.. మే 15న మధ్యాహ్నం 12 గంటల నుంచి జూన్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ పోస్టులకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సింగరేణి అధికారులు సూచించారు.


సింగరేణి సంస్థ 327 పోస్టులకు నోటిఫికేషన్ వెల్లడించగా.. ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో.. మేనేజ్ మెంట్ ట్రైనీ(ఈఅండ్ఎం) ఈ2 గ్రేడ్ -42, మేనేజ్ మెంట్ ట్రైనీ(సిస్టమ్స్) ఈ2 గ్రేడ్-7 పోస్టులు
నాన్ ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో.. జూనియర్ మైనింగ్ ఇంజనీరు టీఅండ్ఎస్ గ్రేడ్ సీ-100, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ(మెకానిక్) టీఅండ్ఎస్ గ్రేడ్ సీ-9, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ(ఎలక్ట్రికల్) టీఅండ్ఎస్ గ్రేడ్ సీ-24, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ-1- 47, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ-1-98 పోస్టుల చొప్పున భర్తీ చేయనున్నారు.

Also Read: రైల్వేలో 4,660 పోలీసు ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకున్నారా మరి..!

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేళ్ల పాటు వయో సడలింపు ఉంటుంది.

Tags

Related News

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

LIC Bima Sakhi Yojana: మహిళలకు LIC బంపర్ ఆఫర్ – ఉచితంగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం

SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Tenth Exams: టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ పద్ధతిలోనే..?

Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే

Big Stories

×