Hyderabad News: హైదరాబాద్‌లో ఓ రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. నడిరోడ్డుపై ఓ వ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టాడు. అందరూ చూస్తుండగానే పిడిగుద్దులతో దాడి చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అసలేం జరిగిందన్న లోతుల్లోకి ఒక్కసారి వెళ్దాం.
హైదరాబాద్‌లోని టోలిచౌక్ ప్రాంతం గురించి చెప్ప నక్కర్లేదు. అర్థరాత్రి అయినా ఆ ప్రాంతంలో మార్కెట్ కొనసాగుతోంది. అయితే అర్ధరాత్రి ఓ రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు. వాహనాల పార్కింగ్ వద్ద అమీనుద్దీన్ వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నాడు.
ఈలోగా వేగంగా వచ్చిన ఓ రౌడీ షీటర్ షాకీర్.. అతనిపై విచక్షణా రహితంగా దాడి చేసి కొట్టాడు. అతగాడి దెబ్బలు భరించ లేక తనను కాపాడాలంటూ గట్టిగా కేకలు వేశాడు. ఈలోగా అటువైపుగా వెళ్తున్న కొందరు యువకులు ఇద్దర్నీ విడిపించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
అయినా రౌడీ షీటర్ మాత్రం అతడ్ని వదల్లేదు. అందరూ చూస్తుండగానే పిడిగుద్దులతో దాడి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై బాధితుడు ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ మొదలుపెట్టారు పోలీసులు. అసలేం జరిగింది? కొట్లాటకు దారి తీసిన ఘటన గురించి ఇరువురి నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
నడిరోడ్డుపై రౌడీ షీటర్ వీరంగం
హైదరాబాద్ లోని టోలిచౌక్ లో అర్ధరాత్రి ఓ రౌడీ షీటర్ వీరంగం సృష్టించాడు
నడిరోడ్డు అమీనుద్దీన్ అనే వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేసిన రౌడీషీటర్ షాకీర్
అందరూ చూస్తుండగానే పిడిగుద్దులతో దాడి
సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దాడి దృశ్యాలు
ఫిలింనగర్… pic.twitter.com/FoGLdoKkUx
— BIG TV Breaking News (@bigtvtelugu) December 3, 2024