BigTV English

Stock Market Investors: స్టాక్ మార్కెట్‌‌లో పెట్టుబడుదారులు.. తెలుగు రాష్ట్రాల స్థానమెంత?

Stock Market Investors: స్టాక్ మార్కెట్‌‌లో పెట్టుబడుదారులు.. తెలుగు రాష్ట్రాల స్థానమెంత?

Stock Market Investors: దేశీయ స్టాక్ మార్కెట్‌ రోజురోజుకూ దూసుకు పోతోందా? పెట్టుబడులు పెట్టే మదుపరులు ఏ రాష్ట్రానికి చెందినవారు? దేశీయ ఇన్వెష్టర్లా? విదేశీ పెట్టుబడుదారులా? ఇవే ప్రశ్నలు చాలామందిని కొన్నాళ్లుగా వెంటాడుతోంది. లేటెస్ట్‌గా మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు దేశీయ మదుపరుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.


దేశీయ మార్కెట్‌లో రోజు రోజుకూ బుల్ జోరు కనిపిస్తోంది. కరోనా సమయంలో ప్రపంచ మార్కెట్లు కుప్పకూలినా, ముంబైలోని దలాల్ స్ట్రీట్ మాత్రం కళకళలాడింది. పెట్టుబడుదారులకు మంచి లాభాలు వచ్చాయి. దీంతో విదేశీ మదుపరుదారులు సైతం బాంబే స్టాక్ మార్కెట్‌పై కన్నేశారు.

ఇంతకీ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెడుతున్న మదుపరులు ఏ రాష్ట్రానికి చెందినవారు అధికంగా ఉన్నారు? ఏపీ లేదా తెలంగాణ ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడు తున్నాయి. ఎందుకంటే దక్షిణాది ప్రజల తెలివి తేటలకు తిరుగులేదని పలు సందర్భాల్లో నేతలు ఓపెన్‌గా చెబుతారు. స్టాక్ మార్కెట్‌లోనూ వీరిదే ఆదిపత్యమని చాలా మంది భావించారు.


మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. టాప్‌-10లో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టే వారి జాబితాలో తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి మిగిలింది. అక్కడి ప్రజలు స్టాక్ మార్కెట్‌పై పెద్దగా దృష్టి సారించకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ALSO READ:  స్టాక్ మార్కెట్‌‌లో పెట్టుబడుదారులు.. తెలుగు రాష్ట్రాల స్థానమెంత?

సౌత్ పరంగా చూస్తే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఈ విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నాయి. కర్ణాటక ఆరో స్థానం, తమిళనాడు ఎనిమిదో ప్లేస్‌లో నిలిచింది. టాప్‌లో మహారాష్ట్ర ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. మార్కెట్‌లో స్టాక్స్‌ని ఏ రోజుకారోజు కొనుగోలు లేదా అమ్మకాలు జరిపినవారు కావచ్చు. పిల్లల కోసం పెట్టుబడులు పెట్టినవారు కావచ్చు.

ముంబై స్టాక్ మార్కెట్‌లో మహారాష్ట్ర నుంచి 3 కోట్లకు పైగా ఇన్వెష్టర్లు ఉన్నారు. యూపీ నుంచి 2 కోట్లకు పైగానే మదుపరులు ఉన్నారు. గుజరాత్ కోటి 80 లక్షల మంది పెట్టుబడిదారులతో థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. ఆ తర్వాత రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలున్నాయి.

తెలుగు రాష్ట్రాల ప్రజలు కేవలం భూముల కొనుగోళ్లపై మొగ్గు చూపడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీనికితోడు మధ్య తరగతి కుటుంబాల్లో కొంతమంది ట్రేడింగ్‌పై అవగాహన లేక చేతులు కాల్చుకున్న సందర్భాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ట్రేడింగ్ వైపు మొగ్గు చూపలేదన్నది మార్కెట్ విశ్లేషకుల మాట.

 

Related News

Real Estate: అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ కొంటున్నారా..అయితే అన్ డివైడెడ్ షేర్ (UDS) అంటే ఏంటి ?.. ఈ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ?

Real Estate: బ్యాంక్ లోన్ తీసుకొని ప్లాట్ కొంటే లాభమా….లేదా అపార్ట్ మెంట్ ఫ్లాట్ కొంటే లాభమా..? రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్

Mobile Recharge: 365 రోజుల వ్యాలిడిటీ 1,999 రీచార్జ్ లో Airtel, Vi, BSNL ఎవరిది బెస్ట్ ఆఫర్

Bank Loans: లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరిస్తున్నారా..అయితే మీ హక్కులను వెంటనే తెలుసుకోండి..? ఇలా కంప్లైంట్ చేయవచ్చు..

Golden City: ఇది ప్రపంచంలోనే గోల్డెన్ సిటీ.. 3వేల మీటర్ల లోతులో అంతా బంగారమే..?

Central Govt Scheme: కేవలం 4 శాతం వడ్డీకే రూ.5 లక్షల రుణం కావాలా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీం మీ కోసమే

Big Stories

×