Gundeninda GudiGantalu Today episode December 3rd : నిన్నటి ఎపిసోడ్ లో.. శృతి హనీమూన్ గురించి రవితో మరోసారి డిస్కస్ చేస్తుంది. కానీ రవి మాత్రం ఇప్పటికే ఇరు ఫ్యామిలీలకు దూరంగా ఉంటున్నామని, ఇప్పుడు అవసరం లేదని చెప్తాడు. ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పటికే తప్పు చేసామని, ఇక ముందు అలాంటి తప్పులు చెయ్యొద్దని, కనీసం ఇరు ఫ్యామిలీలో ఒప్పుకున్న తర్వాతే శోభనం చేసుకుందామని చెబుతాడు. దీంతో శృతి డిసప్పాయింట్ అవుతుంది. తన ముందు ఫ్యామిలీ గురించి మాట్లాడవద్దని, తాను కూడా ఫ్యామిలీని విడిచి వచ్చానని, స్వార్థంగా ఆలోచిస్తున్నారని అనుకున్న పర్వాలేదని అంటుంది. రోహిణి, మనోజ్ మధ్య జాబ్ డిస్కషన్ జరుగుతుంది. లేని జాబ్ గురించి మనోజ్ గొప్పలు చెప్పుకుంటాడు. మీనా కారు ఫైనాన్సియర్ దగ్గరకు మీనా వెళ్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ప్రభావతి, మీనాక్షిలు ఇంట్లో భోజనం చేసి రవిని కలవడానికి బయటకు వెళ్తారు. రవికి రమ్మని ఫోన్ చేస్తారు. రవి అక్కడకు వస్తాడు. ఈ సమయంలో ప్రభావతి ఎక్కడలేని ప్రేమను రవిపై ఓలకపోస్తోంది. శృతి, నువ్వు ఇద్దరి కలిసి ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేస్తుంది. తాను ఇంట్లో వారితో మాట్లాడుతానని హామీ ఇస్తుంది ప్రభావతి. దీంతో రవి సంతోషపడుతాడు. కానీ, బాలు ఇంట్లోకి రానివ్వడని, గతంలో తనపై రెండుసార్లు దాడి చేశాడని చెప్తాడు. నిన్ను రెస్టారెంట్ లో కొట్టాడని తెలుసుకున్న ఆ బాలును నేను మీ నాన్న బాగా తిట్టాము అంటుంది. ఇదంతా మీనా చేయడం వల్ల జరిగిందని, మీనా చెప్పిన మాట వినడంతోనే ఈ అనార్థాలు జరిగాయనీ మరోసారి మీనాను నిందిస్తుంది ప్రభావతి.. అప్పుడు రవి వదినకు నా పెళ్లికి ఏ సంబంధం లేదని చెప్తాడు. ఎప్పుడు ఆమెను నిందించడమే పనా అని అంటాడు. నా పెళ్లి అయ్యాక అక్కడకు వచ్చిందని చెబుతాడు. నువ్వు ఎప్పుడు వదినను నిందిస్తూనే ఉంటావా అని అంటాడు. దానికి కామాక్షి మీనాను ఎప్పుడు నిందించడం మీ అమ్మకు అలవాటే కదా అని అంటుంది.
రవితో ప్రభావతి మాట్లాడుతుంటే కామాక్షి మధ్యలో కలుగ చేసుకొని సెటైర్లు వేస్తుంది. ఈ ఎపిసోడ్ కు ఇదే హైలెట్ అవుతుంది. ఎలాగైనా మీరిద్దరూ ఇంటికి రావాలని, ఇంట్లో వారిని తాను ఒప్పిస్తారంటూ చెప్పి వెళ్తుంది ప్రభావతి. మరోవైపు.. మీనా ఫైనాన్సర్ ను కలవడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే ఫైనాన్సర్ బాడీగార్డ్స్ వచ్చి.. వాస్తవానికి అన్నకు నిన్ను కలవడం ఇష్టం లేదని, నువ్వు వెయిట్ చేస్తా అంటే ఉందని అన్నాడు. కానీ, ఇక్కడ ఉండి ప్రయోజనం లేదని వారు చెబుతారు. ఆ విషయాన్నీ మరోసారి సేటుకు చెప్తారు. కానీ సేటు కలవనని విసుక్కుంటాడు. అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మీనా ఎంతగా చెప్పినా వినిపించుకోడు. ఇక అక్కడ పని చేసే ఒక అమ్మాయి సేటు ఆఫీస్ లో చిరాగ్గా ఉంటాడు. ఇంటికి వెళ్లి కలవండి అని సలహా ఇస్తుంది.
ఇక బాలు తినడానికి ఇంటికి బయలుదేరుతాడు. కానీ, మొత్తం కార్లు కడిగిన తర్వాతనే ఇంటికి వెళ్లాలని, లేదంటే.. పని మానేయమని అక్కడ ఓనర్ అంటాడు. దీంతో చేసేది ఏం లేక అన్ని కార్లు కడిగిన తర్వాతనే తినడానికి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే తన తండ్రి కూడా భోజనం చేయడానికి సిద్ధమవుతాడు. బాలు, తన తండ్రి ఇద్దరూ కలిసి భోజనం చేయాలని, సిద్దమవుతారు. అంతలోనే సాంబార్లో బల్లి పడ్డ విషయాన్ని బాలు గమనిస్తాడు. వెంటనే దగ్గర నుండి ప్లేటు లాగేసుకుని సాంబార్లో బల్లి పడిందని కోప్పాడుతాడు. నువ్వు ఒక్కడివే పెట్టుకొని తింటున్నావు మా ఆవిడా ఎక్కడ అని అడుగుతాడు. అలాగే మీ ఆవిడా నిన్ను వదిలేసి పోయారా అని అడుగుతాడు. ఇంతలోనే తన తల్లి ప్రభావతి ఇంటికి చేరుకుంటుంది.. ఎక్కడికి వెళ్ళావు అసలు అంటే కామాక్షితో బయటకు వెళ్లాను అంటుంది. ఆవిడకు ఏమి పనిలేక వెళ్తుంది. అనగానే అప్పుడే కామాక్షి ఎంట్రీ ఇస్తుంది.
ఏంటి బాలు ఎవరి మీదో కోపడుతున్నాడని అంటుంది. అందరు ఆమెను వింతగా చూస్తారు. ఇక ఏమైందని ప్రభావతి అడుగుతుంది. దానికి బాలు కోపంగా ఉంటాడు. సాంబార్లో బల్లి పడిందనీ, ఆ విషయాన్ని పట్టించుకోరా అంటూ కోప్పడతాడు. తనకేం తెలియదని, మీనానే పని ఉందంటూ ఎక్కడ పని అక్కడ నే విడిచి వెళ్లిందంటూ మీనా పై మరో నింద వేస్తుంది. అంతలోనే మీనా కూడా ఇంటికి చేరుతుంది. ఇంట్లోకి రాగానే మామయ్య భోజనం చేసారా అని అడుగుతుంది. ప్రభావతి బాలు మీనా పై అరుస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..