E-Paper
Advertisement

RTC Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన ఆర్టీసీ బస్సు, ఆదిలాబాద్ జిల్లాలో ఘటన

RTC Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన ఆర్టీసీ బస్సు,  ఆదిలాబాద్ జిల్లాలో ఘటన
Advertisement

RTC Bus Accident:  ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాంపూర్ ప్రాంతంలో అదుపు తప్పి వాగులో పడిపోయింది ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఘటన గురించి తెలియగానే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే పోలీసులు, అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. గాయపడిన బాధితులను లోయ నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉట్నూరు మండలం షాంపూర్ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి వాగులో పడిపోయింది. అసిఫాబాద్ డిపోకు చెందినది ఈ ఆర్టీసీ బస్సు. ఘటన సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. స్టీరింగ్‌పై డ్రైవర్ కంట్రోల్ పోవడంతో అదుపు తప్పి వాగులో పడిపోయింది.

ఈ ఘటనలో బస్సులోని డ్రైవర్, కండక్టర్‌తోపాటు పలువురు ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు షాంపూర్ సమీపంలోని వంతెన వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా అదుపు తప్పినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికుల ఆర్తనాదాలు మొదలయ్యాయి. సమీపంలోని ప్రజలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Advertisement

లోయలో పడిన ఆర్టీసీ బస్సులు.. పలువురి పరిస్థితి విషమం

ప్రమాద గురించి స్థానికులు పోలీసులు, 108 సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఈలోగా బస్సులోని ప్రయాణికులను బయటకు తీశారు. లోయ కావడంతో బాధితులను కింద నుంచి రోడ్డు పైకి తీసుకురావడం కాస్త కష్టంగా మారింది. చికిత్స నిమిత్తం బాధితులను ఉట్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గాయపడినవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. మెరుగైన వైద్యం కోసం వారిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమా? సాంకేతిక లోపమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

ALSO READ: ఛీ.. ఛీ.. కన్నతల్లి ఎంత పని చేసింది.. చెన్నైలో దారుణం

 

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×