BigTV English

Kiran Abbavaram About Pawan Kalyan : గ్యాంగ్ స్టార్ తో పాటు పవన్ కళ్యాణ్ ఆ జోనర్ లో సినిమా చేస్తే బాగుంటుంది

Kiran Abbavaram About Pawan Kalyan : గ్యాంగ్ స్టార్ తో పాటు పవన్ కళ్యాణ్ ఆ జోనర్ లో సినిమా చేస్తే బాగుంటుంది

Kiran Abbavaram :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి ఉన్న రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉంటుందో కొత్తగా పరిచయం కూడా చేయక్కర్లేదు. ఒక డిజాస్టర్ సినిమాతో కూడా అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టగలిగే స్టామినా కళ్యాణ్ కి ఉంది. ఒక పదేళ్లు హిట్ సినిమా లేకపోయినా కూడా పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ మార్కెట్ రెండు పెరుగుతూ వచ్చాయి. ఏ హీరో కూడా ఇలా జరగదు అని చెప్పాలి. ఇక గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా ఆ సినిమా నిలబడింది. ఒక రీమేక్ సినిమాతో రికార్డ్ క్రియేట్ చేయటం అనేది మామూలు విషయం కాదు. హరీష్ శంకర్ (Harish Shankar) ఆ సినిమాను కూడా చాలా అద్భుతంగా డిజైన్ చేశాడు. పవన్ కళ్యాణ్ లో మిస్ అయిన ఎనర్జీని మళ్లీ బయటికి తీసాడు.


Also Read : Dulquar Salmaan : లక్కీ భాస్కర్ సినిమాలో వాడింది నా పర్సనల్ కార్ 

ఇక కేవలం పవన్ కళ్యాణ్ కి అభిమానులు బయట మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో కూడా ఉన్నారు. చాలామంది హీరోలు కూడా పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్ అని చెప్పాలి. నితిన్ (Nithiin) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నితిన్ ఇష్క్ (Ishq) సినిమా ఆడియో లాంచ్ కి పవన్ కళ్యాణ్ గెస్ట్ గా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ పై తన ప్రేమ ఎంత తెలిపాడు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో పవన్ కళ్యాణ్ సాంగ్స్ రిఫరెన్స్ గా కూడా పెట్టాడు. అ ఆ సినిమా ఆడియో లాంచ్ కు కూడా పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) నితిన్ తో సినిమా చేయడానికి కూడా కారణం పవన్ కళ్యాణ్. నితిన్ లానే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. ఈ విషయాన్ని కిరణ్ కూడా చాలా సందర్భాల్లో తెలిపాడు. రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి మరికొన్ని విషయాలు చెప్పాడు.


Also Read : Sree Vishnu : సెన్సార్ కి కూడా దొరకకుండా అన్ని బూతులు ఎలా మేనేజ్ చేస్తావ్ అన్న.?

పవన్ కళ్యాణ్ ఎటువంటి సినిమాలు చూస్తే మీకు నచ్చుతుంది అని ఇంటర్వ్యూ లో అడిగినప్పుడు, పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్ స్టార్ సినిమా చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు సుజీత్ దర్శకత్వంలో అది చేస్తున్నారు ఓకే, ఖచ్చితంగా ఆ సినిమా మంచి హిట్ అవుతుందని అనిపిస్తుంది. అలానే వైట్ షర్ట్ వైట్ పంచ కట్టుకొని ఫ్యాక్షన్ సినిమా చేస్తే పవన్ కళ్యాణ్ కి అదిరిపోతుంది. ఇదివరకే కాటమరాయుడు సినిమా చేశారు కానీ అది జోనర్ వేరు. అలా కాకుండా కంప్లీట్ గా ఒక ఫ్యాక్షన్ సినిమా చేస్తే పవన్ కళ్యాణ్ కి అద్భుతంగా వర్కౌట్ అవుతుంది అంటూ తెలిపాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×