E-Paper
Advertisement

Maharashtra: ఘోరం.. డ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన కారు..

Maharashtra: ఘోరం.. డ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన కారు..
Advertisement

Maharashtra: మహారాష్ట్రలోని ఠాణే జిల్లా అంబర్‌నాథ్ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్‌కు గుండె పోటు రావడంతో ఒక్కసారిగా వాహనం నియంత్రణ కోల్పోయింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

మహారాష్ట్రలోని ఠాణేలో ఘోర రోడ్డు ప్రమాదం
పూర్తి వివరాల్లోకి వెళితే శుక్రవారం సాయంత్రం మహారాష్ట్రలోని ఠానే జిల్లాలలోని అంబర్‌నాథ్ ఫ్లైఓవర్ పై ఈ ప్రమాదం జరిగింది. అయితే వివరాల ప్రకారం శివసేన పార్టీ స్థానిక ఎన్నికల అభ్యర్థి కిరణ్ చాబే ప్రచారం ముగించుకుని తిరిగి వస్తుండగా, కారు డ్రైవర్‌కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. దీంతో నియంత్రణ కోల్పోయిన కారు వేగంగా ఎదురుగా వస్తున్న బైక్‌ల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక బైకర్ గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్ కింద పడ్డాడు.

Advertisement

Also Read: వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం.. తొలి దర్యాప్తు అధికారి డిస్మిస్..

బైక్‌లపైకి దూసుకెళ్లి కారు.. స్పాట్‌లోనే మృతి చెందిన ముగ్గురు బైకర్లు
ఈ దుర్ఘటనలో కారు డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు (బైకర్లు) అక్కడికక్కడే మృతి చెందారు. కిరణ్ చాబేతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరికొందరికి గాయాలు కాగా, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×