BigTV English
Advertisement

Veeraiah Murder case: ఒక్కో కత్తి పోటుకు రూ. 2 లక్షలు.. వీరయ్య హత్య కేసులో సంచలన నిజాలు

Veeraiah Murder case: ఒక్కో కత్తి పోటుకు రూ. 2 లక్షలు.. వీరయ్య హత్య కేసులో సంచలన నిజాలు

Veeraiah Murder case: ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి దారుణ హత్యకి గురయ్యాడు. సంతనూతలపాడు నియోజకవర్గం నాగులప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు చెందిన మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకుడిగా ఉన్నారు. 22న మంగళవారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో.. ఒంగోలులోని తన కార్యాలయంలో ఉన్న వీరయ్య చౌదరిని గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ఆఫీసులోకి వచ్చి కత్తులతో విచక్షణ రహితంగా పొడవడంతో అక్కడక్కడే మృతి చెందాడు.


ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపిన టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. సూత్రధారులు, పాత్రధారుల మధ్య కుదిరిన ఒప్పందంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. డీలింగ్‌లో భాగంగా ఒక్కో కత్తిపోటుకు 2 లక్షలు అనే మాట హాట్ టాపిక్‌గా మారింది. వీరయ్య చౌదరి శరీరంపై 53 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు.

ఎంక్వైరీలో భాగంగా అనుమానితులను పట్టుకొని విచారిస్తున్నారు. మద్యం, రేషన్ బియ్యం, ఇసుక మాఫియా, రొయ్యల చెరువుల వ్యవహారాలే హత్యకు కారణం అంటూ పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. పాత్రధారులు సూత్రధారులతో పాటు బ్యాక్‌‌గ్యాండ్ ఉన్నవారిని అన్వేషించి విచారణ చేస్తున్నారు. అయితే హత్య కేసులో సొంత పార్టీ, ప్రతిపక్ష పార్టీల ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.


గత కొద్ది రోజుల క్రితం.. ఈ వీరయ్య చౌదరి హత్య కేసుకు సంబంధించి కీలక కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. ఈ కేసులో మరొక ద్విచక్ర వాహనం లభ్యమైంది. సంతనూతలపాడు మధ్య వాహనాన్ని గుర్తించారు పోలీసులు. ఈ ద్విచక్ర వాహనాన్ని హంతకుడు వినియోగించినట్లు నిర్ధారించారు. హత్యకు ముందు టూ వీలర్‌ను వేరు వేరు ప్రదేశాల్లో వదిలిపెట్టినట్లు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు.

అయితే హత్య టైంలో నిందితులు వాడిన స్కూటీని గుర్తించారు. చీమకుర్తిలోని ఓ దాబా దగ్గర స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. అయితే బైక్ చీమకుర్తికి చెందిన ముస్లిం వ్యక్తిపై రిజిస్ట్రేషన్ ఉండటంతో.. ఆయన్ని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. స్కూటీకి ముస్లిం వ్యక్తికి ఏం సంబంధం.. హత్యలో ఇతడి పాత్ర ఉందా.. లేక హత్యకు ఏమైనా సహకరించారా అన్న కోణంలో ఎంక్వైరీ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

కాగా ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎంపీపీ వీరయ్య చౌదరి దారుణ హత్య కేసులో.. ప్రధాన నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.. వీరగంధం దేవేందర్‌నాథ్‌ను హత్య కేసులో నిందితుడిగా అనుమానిస్తున్నారు. హత్యకు ప్రధాన కారణం దేవేందరే అనే అనుమానంతో ఎంక్వైరీ చేస్తున్నారు. నాగులప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకి చెందిన దేవేందర్ లిక్కర్ సిండికేట్ వ్యాపారం చేస్తున్నారు. వ్యాపార లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.

Also Read: బంధువుల పెళ్లిలో కాల్పులు.. కూతుర్ని చంపిన తండ్రి, మహారాష్ట్రలో దారుణం

ప్రధాన నిందితులుగా ఆరోపించబడుతున్న దేవేంద్రనాథ్ చౌదరి, ముప్పు సురేష్‌లలో.. దేవేంద్ర నాథ్ చౌదరి పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ముప్పు సురేష్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. గ్రీన్ కార్డ్ హోల్డర్ అయిన సురేష్.. దుబాయ్‌లో వజ్రాలు వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపార లావాదేవీలలో అడ్డు వస్తున్నాడని హత్యకి కుట్ర పన్నినట్టు ఒప్పుకున్నారు. ఈ కేసులో మరో ఆరుగురు నిందితులు ఉన్నట్లు సమాచారం.

Related News

Food Poisoning: షాకింగ్‌.. కలుషిత ఆహారం తిని 86 మంది విద్యార్థులకు అస్వస్థత

Kama Reddy News: పాపం.. అత్త, మామల వేధింపులు తట్టుకోలేక అల్లుడు ఆత్మహత్య..

crime News: దారుణం.. ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి ఆత్మహత్య.. వీడియో వైరల్

Visakha News: రాష్ట్రంలో దారుణ ఘటన.. కాలేజీలో మేడం లైంగిక వేధింపులు, స్టూడెంట్ సూసైడ్

UP Crime: ఛీఛీ.. ఇలా కూడా ఉంటారా..? రూ.కోటి బీమా, వివాహేతర సంబంధం కోసం కన్న కొడుకును చంపేసి..?

Online Scam: రూ.1.86 లక్షలు విలువ చేసే ఫోన్ ఆర్డర్ పెట్టిన టెక్కి.. బాక్సులో ఉన్నది చూసి షాక్

CPM Leader Murder: ఖమ్మంలో దారుణం.. సీపీఎం నేత హత్య

Ranga Reddy News: దారుణం.. వాగు దాటుతూ.. నీటిలో కొట్టుకుపోయిన దంపతులు

Big Stories

×