BigTV English

Honour killing: బంధువుల పెళ్లిలో కాల్పులు.. కూతుర్ని చంపిన తండ్రి, మహారాష్ట్రలో దారుణం

Honour killing: బంధువుల పెళ్లిలో కాల్పులు.. కూతుర్ని చంపిన తండ్రి, మహారాష్ట్రలో దారుణం

Honour killing: కని, పెంచిన తల్లిదండ్రులను కాదంది ఆ యువతి. మనసుకు నచ్చినవాడ్ని మనువాడింది. పైగా తల్లిదండ్రుల ముందే భర్తతో కలిసి తిరుగుతుండడం తట్టుకోలేకపోయాడు కన్నతండ్రి. బంధువుల వద్ద తన పరువు తీసిందని భావించాడు. ఇరుగుపొరుగు వారి మాటలను తట్టుకోలేకపోయాడు. చివరకు కూతుర్ని చంపేశాడు. సంచలనం రేపిన పరువు హత్య మహారాష్ట్రలో చోటు చేసుకుంది.


అసలేం జరిగింది?

పైన కనిపిస్తున్న యువతి పేరు తృప్తి. వయస్సు కేవలం 24 ఏళ్లు మాత్రమే. ఆ అబ్బాయి పేరు అవినాష్ వాగ్. ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్త ఫ్రెండ్ షిప్‌గా మారింది. కొన్నాళ్లు దూరంగా ఉన్నారు.. చివరకు అది ప్రేమ అని తెలుసుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే యువతి తల్లిదండ్రులు అందుకు ససేమిరా అన్నారు.


తృప్తిది సొంతూరు మహారాష్ట్రలోని శిర్పూర్. ఆమె తండ్రి కిరణ్ మాంగ్లే రిటైర్డ్ సీఆర్పీఎఫ్ అధికారి. కూతురి తృప్తిని అల్లారు ముద్దుగా పెంచారు తల్లిదండ్రులు. కావాల్సిన చదువు చదివించారు. చివరకు ఓ వ్యక్తిని ప్రేమించింది. కట్టుబాట్లకు ప్రాణం ఇచ్చే కుటుంబంలో కూతురు ప్రేమను తిరస్కరించారు. అయినా సరే అమ్మాయి ఇంట్లో వారికి చెప్పకుండా లవ్ మ్యారేజ్ చేసుకుంది. ప్రస్తుతం పూణెలో నివాసం ఉంటున్నారు.

టార్గెట్ పెళ్లి

శనివారం రాత్రి 10 గంటలకు జరగనున్న అవినాష్ సోదరి పెళ్లికి తృప్తితోపాటు ఆమె భర్త హాజరయ్యారు. జల్గావ్ జిల్లాలోని చోప్డా తాలూకాలో వివాహం వైభవంగా జరిపేందుకు అంతా రెడీ అయ్యింది.  బంధు మిత్రులతో హల్దీ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. ఈ పెళ్లికి కూతురు వస్తుందని తెలుసుకున్నాడు ఆమె తండ్రి కిరణ్ మాంగ్లే. తనతోపాటు తెచ్చుకున్న రివాల్వర్‌తో కూతుర్ని కాల్చి చంపాడు. అల్లుడిపై కూడా కాల్పులు జరిపాడు. కాకపోతే తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే పెళ్లిలోని కొందరు వ్యక్తులు కిరణ్ మాంగేని పట్టుకుని కొట్టారు.

ALSO READ: కాబోయే భార్య కోసం కొడుకుని చంపిన తండ్రి

ఆసుపత్రిలో మామ-అల్లుడు

పెళ్లిలో కాల్పుల గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కిరణ్‌ని పట్టుకున్న పెళ్లి బంధువులు అతడ్ని పోలీసులకు అప్పగించారు. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మామ-అల్లుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తృప్తి మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

తమ కళ్ల ముందే కోడలి చనిపోవడం అత్తింటి వారు జీర్ణించుకోలేపోయారు.  ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న అవివాష్, ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు. కొడుకుని ఆ విధంగా పేరెంట్స్ కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇలాంటి ఘటన మరెవరికీ జరగకూడదని అంటున్నారు.

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×