Anesthetics: ఎనస్తీషియా అనేది ఆపరేషన్స్ సమయంలో రోగులకు నొప్పి లేకుండా చేయడానికి ఉపయోగించే ఒక రకపైన మెడిసిన్. ఇది శరీరంలోని నరాల వ్యవస్థను తాత్కాలికంగా ప్రభావితం చేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఎనస్తీషియాలో లోకల్, రీజనల్, జనరల్ అని మూడు రకాల ఎనస్తీషియా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎనస్తీషియాలో కరాలు
లొకల్ ఎనస్తీషియా శరీరంలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే మొద్దుబారేలా చేస్తుందట. రీజనల్ అనస్థీషియా శరీరంలో ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని, ఉదాహరణకు కాళ్లు లేదా చేతులను, ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. జనరల్ ఎనస్తీషియా వేయడం వల్ల పేషెంట్ పూర్తిగా స్పృహ కోల్పోతాడు. ఇది పెద్ద పెద్ద ఆపరేషన్స్ సమయంలో మాత్రమే ఉపయోగపడుతుందట.
డోస్ ఎక్కువైతే?
ఎనస్తీషియా సాధారణంగా అయితే చాలా సేఫ్. కానీ, దాని డోస్ ఎక్కువైతే తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డోస్ ఎక్కువైనప్పుడు, శ్వాసకోశ సమస్యలు, రక్తపోటు తగ్గడం, గుండె సమస్యలు, లేదా స్పృహ కోల్పోవడం వంటివి జరిగే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో, దీని డోస్ చాలా ఎక్కువైతే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.
ALSO READ: ఎనీమియాతో ఇబ్బంది పడుతున్నారా? ఈ డైట్ ట్రై చేయండి
సైడ్ ఎఫెక్ట్స్
ఎనస్తీషియా ఇచ్చిన తర్వాత కొందరు పేషెంట్స్‌కి వికారం, మైకం, లేదా గందరగోళం వంటివి వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇవి నార్మల్‌గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే. వీటి వల్ల ఆరోగ్యంపై కూడా పెద్దగా చెడు ప్రభావం పడే అవకాశం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, డోస్ ఎక్కువైతే, ఈ సైడ్ ఎఫెక్ట్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.అలాంటి సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె కొట్టుకునే వేగంలో మార్పులు వంటివి జరిగే అవకాశం ఉందట. అందుకే శస్త్రచికిత్స సమయంలో పేషెంట్ శ్వాస, గుండె చప్పుడు, రక్తపోటును డాక్టర్లు ఎప్పటికప్పుడు చెక్ చేస్తారు.
జాగ్రత్తలు
ఎనస్తీషియా వల్ల జరిగే ప్రమాదాలను తగ్గించడానికి, పేషెంట్స్ ముందుగానే డాక్టర్లకు తమ ఆరోగ్య సమస్యల గురించి చెప్పాలి. సిగరెట్ తాగడం, మద్యపానం, లేదా ఇతర మెడిసిన్స్ ఏవైనా వాడుతున్నట్లు అయితే ముందుగానే సమాచారం ఇవ్వాలి. అలాగే, ఆపరేషన్‌కు ముందు డాక్టర్లు ఇచ్చే సూచనలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.