Terrorist Firing In Poonch: కశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఓ వైపు ఉగ్రవాదుల కోసం కశ్మీర్ అడవులను జల్లెడ పడుతోంది. ఇదే అదునుగా పాక్ ఆర్మీ రెచ్చిపోతుంది. లైన్ ఆఫ్ కంట్రోల్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరుపుతోంది. వరుసగా నాలుగు రోజుల నుంచి రాత్రి సమయంలో భారత ఆర్మీ పోస్టులే టార్గెట్‌గా కాల్పులు జరుపుతోంది. నిన్న రాత్రి కూడా కుప్వారా, పూంచ్ సెక్టార్‌లలో కాల్పులకు తెగబడింది పాక్ ఆర్మీ. అయితే తాము కూడా అదే స్థాయిలో బదులిచ్చామని ప్రకటించింది ఇండియన్ ఆర్మీ.
రాత్రి సమయంలో కాల్పులు జరుపుతున్న పాక్ ఆర్మీ
లైట్ వెపన్స్‌తో రాత్రి సమయంలో కాల్పులు జరుపుతోంది పాక్ ఆర్మీ. అయితే రెచ్చగొట్టేందుకు ఇలా వ్యవహరిస్తోందా? లేక కాల్పుల మాటున ఉగ్రవాదులను సరిహద్దు దాటిస్తోందా? అనే అనుమానాలు ఉన్నాయి. మరోవైపు ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తూనే.. చొరబాట్లు జరగకుండా అదనలపు బలగాలను సరిహద్దుల్లో మోహరించారు.
లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు
ఈ క్రమంలో జమ్మూకశ్మీర్‌లో పెద్ద ఎత్తున ఉగ్రవాద ఏరివేత చర్యలు చేపట్టాయి. లష్కరే తోయిబా ఉగ్ర ముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదుల, అనుమానితుల ఇళ్లను భద్రతా బలగాలు ధ్వంసం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మరో ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చివేశాయి. ఉగ్రవాదులు ఫరూఖ్ అహ్మద్ తద్వా, జమీల్ అహ్మద్ షీర్ అమీర్ నాజిర్, అద్నాన్ సఫీ, జాకీర్ అహ్మద్ ఇళ్లను ధ్వంసం చేశాయి. దీంతో ఇప్పటి వరకు పది మంది ఉగ్రవాదుల ఇళ్లను పేల్చి వేశామని.. మిగిలిన వారిపైనా ఇలాంటి చర్యలే ఉంటాయని అధికారులు తెలుపుతున్నారు. ఉగ్ర స్థావరాలను గుర్తించడానికి శ్రీనగర్‌లోని 60కి పైగా ప్రదేశాల్లో దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు
పహల్గాం దాడి అనంతరం ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు జరపడానికి భద్రతా బలగాలు వెళ్లాయి. ఈ క్రమంలో ఆదిల్ హుస్సేన్ థోకర్, మరో ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇళ్లల్లో అప్పటికే బాంబులు యాక్టివేట్ అయి ఉన్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో బలగాలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. ఇక ఇతర ఉగ్రవాదుల ఇళ్లను కూడా అధికారులు పేల్చివేస్తున్నారు. ఇందులో భాగంగా లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్, యాక్టివ్ టెర్రరిస్ట్‌లు జాహిద్ అహ్మద్, అహ్‌సన్ ఉల్ హక్, హరీస్ అహ్మద్ ఇళ్లను పేల్చివేశారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల రహస్య స్థావరాన్ని గుర్తించి.. ఐదు ఏకే 47 తుపాకులు, భారీ సంఖ్యలో తూటాలు, పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు పహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల జాడ చెప్పినవారికి 20 లక్షల నజరానాను ప్రకటించారు పోలీసులు. సంబంధిత టెర్రరిస్టుల రేఖా చిత్రాలను కూడా విడుదల చేశారు.
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో హైటెన్షన్
భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే కశ్మీర్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఓ వైపు ఉగ్రవాదుల కోసం కశ్మీర్ అడవులను జల్లెడ పడుతోంది. ఇదే అదునుగా పాక్ ఆర్మీ రెచ్చిపోతుంది. లైన్ ఆఫ్ కంట్రోల్‌లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరుపుతోంది. ఇదే టైంలో ఢిల్లీలో అత్యంత వేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాసేపట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోఢీతో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భేటీ కానున్నారు.
Also Read: భారత్ ఆంక్షల ఎఫెక్ట్.. పాకిస్తాన్లో ఇప్పుడు లీటర్ వాటర్ బాటిల్ ధర ఎంతో తెలుసా?
CDS అనిల్‌చౌహాన్‌తో రాజ్‌నాథ్ సుదీర్ఘ చర్చలు
నిన్న నిన్న CDS అనిల్‌చౌహాన్‌తో రాజ్‌నాథ్ సుదీర్ఘ చర్చలు జరిపారు. మరోవైపు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌తో సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలోనే మోడీతో రాజ్‌నాథ్ సింగ్ భేటీ కీలకంగా మారింది. ప్రస్తుతం బోర్డర్‌లో పరిస్థితిపై ప్రధానికి వివరించనున్నారు. అయితే వరుస భేటీలతో నెక్ట్స్ ఏం జరుగుతుందనే టెన్షన్ అందరిలో నెలకొంది. ఇప్పటికే ఆర్మీ, పారామిలిటరీ సిబ్బంది సెలవులు రద్దు చేసింది. వెంటనే రావాలంటూ సెలవుల్లో ఉన్నవారికీ ఆదేశాలు ఇచ్చింది. అటు బోర్డర్‌లోనూ భారీగా సైన్యం మోహరించింది. ఏ క్షణమైనా కీలక ఆదేశాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉండటంతో ఉత్కంఠ నెలకొంది.
మోడీ-రాజ్‌నాథ్ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం
మోడీ-రాజ్‌నాథ్ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏ క్షణమైనా పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ వార్ డిక్లేర్ చేస్తారా? మోడీ సైగ చేస్తే యుద్ధానికి భారత్ సిద్ధంగా ఉందా? ఏ సెకండ్‌లోనైనా పాక్‌పై భారత యుద్ధం చేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. దీంతో ఎప్పుడు…ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ అయితే మినట్ టూ మినట్ కంటిన్యూ అవుతోంది.