Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. విజయపురు జిల్లాలో మునగులి సమీపంలో కారును ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఉన్నారు.
ఈ ప్రమాదంలో మృతిచెందిన వారంతా జోగులాంబ గద్వాల జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన టీ. భాస్కర్, ఆయన భార్య పవిత్ర, అభిరామ్, జ్యోత్స్న పాటు డ్రైవర్ శివప్ప, బస్సు డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. టీ. భాస్కర్ పదేళ్ల కొడుకు ప్రవీణ్ కు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రవీణ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత కొన్ని రోజుల నుంచి భాస్కర్ కెనెరా బ్యాంక్ లో పని చేస్తున్నాడు. ఫ్యామిలీతో కలిసి గద్వాలలోని బీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు క కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Skywalk: హైదరాబాద్‌లో అత్యద్భుతంగా మరో స్కైవాక్.. త్వరలోనే ప్రారంభం.. ఎక్కడో తెల్సా..?