Rana Naidu 2 Teaser : టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి వెంకటేష్, రానా కాంబోలో వచ్చిన రానా నాయుడు వెబ్ సిరీస్ సీజన్ 2. ఈ సిరీస్ జూన్ 13 నుండి నెట్ ఫిక్స్ లో తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అవుతున్నట్లు చిత్ర బృందం ఇటీవల ప్రకటించింది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ అర్జున్ రాంపాల్ విలన్ గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. కృతికర్బంధ, రానా, వెంకటేష్ కీలకపాత్రలో నటించనున్నారు. ఈ వెబ్ సిరీస్ కు కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన టీజర్ వెబ్ సిరీస్ అంచనాలు పెంచేస్తోంది. ఆ వివరాలు చూద్దాం..
సీజన్ 1 కి మించి..సీజన్ 2..
రానా నాయుడు సీజన్ 2 లో రానా నాయుడు తన కుటుంబ భవిష్యత్తును సేఫ్ గా కాపాడాలనుకుంటాడు.అందుకే అతను గతాన్ని వదిలి దూరంగా వచ్చేస్తాడు. కానీ అండర్ వరల్డ్ డాన్ తిరిగి రావడంతో అతనికి సవాళ్లు ఎదురవుతాయి. ఇదే టీజర్ లో చూపించారు. టీజర్ మొదట్లో నీతో ఇలా ప్రయాణం చాలా సంతోషంగా ఉంది చాలా ప్రశాంతంగా ఇటువంటి ఫైట్స్ ఎటువంటి గొడవలు లేకుండా హాయిగా ఉంది అంటూ రానాతో హీరోయిన్ అంటుంది. కట్ చేస్తే రానా ఇస్ బ్యాక్ అంటూ టీజర్ సాగుతుంది. అందులో వెంకటేష్ ఎంట్రీ ఇవ్వడం. రానా ఫైటింగ్, చివర్ లో అర్జున్ రాంపాల్ ను వెంకటేష్, రానా కలిసి ఫైట్ చేయటం. ఇదంతా రానా ఫ్లైట్లో కూర్చొని గుర్తు చేసుకుంటున్నట్లు చూపిస్తారు. ఇలా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అని రానాతో కృతి అనడం, రానా కళ్ళు మూసుకుంటే గతం కనిపించడం ట్రైలర్ ముగుస్తుంది. ఈ టీజర్ లో బోల్డునెస్ అనే మాటే లేదు కేవలం యాక్షన్ మాత్రమే ప్రస్తుతం చూపించారు. సిరీస్ లో ఉందో లేదో తెలియదు కానీ ప్రస్తుతం టీజర్ లో అయితే మాత్రం దాని జోలికి పోకుండా కట్ చేశారు మేకర్స్.ఈ టీజర్ ఆధ్యాంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
రానా నాయుడు ,అర్జున్ రాంపాల్ ..మధ్య పోరు హైలెట్ ..
రానా నాయుడు సీజన్ 2 జూన్ 13న నెట్ ఫ్లిక్ లో అందుబాటులోకి రానుంది. సీజన్ 1 గ్లోబల్ టాప్ టెన్ నాన్ ఇంగ్లీష్ టీవీ జాబితాలో, 42.2 మిలియన్ల గంటల వీక్షణతో టాప్ 400 లో నిలిచిన ఈ సిరీస్ సీజన్ 2 మరింత ఆసక్తిని పెంచుతుంది. కరణ్ అర్జున్, అభయ చోప్రా దర్శకత్వంలో ఈ సిరీస్, రూపొందింది. ఈ సీజన్లోనూ మొదటి సీజన్ లాగానే రానా నాయుడు, నాగానాయుడు మధ్య ఫైటింగ్ సీన్స్ అర్జున్ రాంపాల్ కొత్త పాత్ర తో మరిన్ని ట్రస్టులు ఇవ్వనున్నారు. రానా దగ్గుపాటి వర్సెస్ అర్జున్ రాంపాల్ మధ్య హోరాహోరీ పోరు జరగనుంది.