E-Paper
Advertisement

Hyderabad Crime: టెక్కీ సూసైడ్ వెనుక.. వెలుగులోకి కొత్త విషయాలు, అదే కారణమా?

Hyderabad Crime: టెక్కీ సూసైడ్ వెనుక.. వెలుగులోకి కొత్త విషయాలు, అదే కారణమా?
Advertisement

Hyderabad Crime: డబ్బులున్నా.. లేకున్నా.. అయినవాళ్లు దగ్గరుంటే ఆనందంగా జీవించవచ్చని చాలామంది భావిస్తుంటారు. అలాంటి అదృష్టం కొందరికి మాత్రమే వస్తుంది. ఇప్పుడున్న రోజుల్లో చాలా కష్టమనే భావన చాలా మందిలో ఉంది. ఉద్యోగాల నిమిత్తం భర్త ఒక చోటు.. భార్య- పిల్లలు మరొకచోట ఉన్న సందర్భాలు లేకపోలేదు. అది ఒక్కోసారి మనిషిని మానసికంగా కుంగదీస్తుంది. ఫలితంగా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. రెండురోజుల కిందట హైదరాబాద్ సూసైడ్ చేసుకున్న టెక్కీ విషయంలోనూ అదే జరిగింది?

హైదరాబాద్ లో టెక్కీ సూసైడ్ వెనుక కొత్త కోణం

Advertisement

సురేందర్‌రెడ్డి-విజయరెడ్డిలకు 2007లో వివాహం జరిగింది. అయితే సురేందర్‌రెడ్డికి నాలుగేళ్ల కిందట దుబాయ్‌లో ఉద్యోగం రావడంతో వెళ్లాడు. విజయారెడ్డి ఓ ఐటీ కంపెనీలో టీమ్‌లీడర్‌గా పని చేస్తోంది. ఈ దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. అందులో ఒకరికి 17 ఏళ్లు, మరొకరికి 18 ఏళ్లు. వీరి ఫ్యామిలీ ఉప్పల్‌‌లోని రాఘవేంద్రనగర్‌లో నివాసం ఉంటోంది.

తల్లి పుష్పలతతో కలిసి విజయారెడ్డి పిల్లలతో అక్కడే ఉంది. అయితే వీరికి డబ్బులకు ఏ మాత్రం కొదవలేదు. రాత్రి వేళ డ్యూటీలు ఉండడంతో ఇద్దరు పిల్లలను హాస్టల్స్‌లో ఉంచి చదివిస్తోంది. విజయారెడ్డి శుక్రవారం హాస్టల్స్‌లో ఉన్న ఇద్దరు పిల్లలతో సాయంత్రం సొంత కారులో బయటకు వచ్చింది. కారుని చర్లపల్లి రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌లో నిలిపింది.

Advertisement

ఒంటరి తనం ఆత్మహత్యకు దారి తీసింది?

పార్కింగ్‌ స్లిప్‌ వెనుక తనకు జీవించాలనే ఆశ లేదని, తాను దూరమైతే పిల్లలు ఒంటరవుతారని రాసి ఉంది. ఆ స్లిప్‌ ని కారులో వదిలేసింది. సూసైడ్‌ లెటర్‌ను ఫొటో తీసి తన వాట్సప్‌లో స్టేటస్‌గా ఆమె ఉంచింది. శనివారం తెల్లవారుజామున రెండున్నర గంటల సమయంలో ఎంఎంటీఎస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం భార్యభర్తల మధ్య దూరం పెరిగింది.

ఆమెలో ఒక్కసారిగా ఒంటరి భావనను పెంచింది. కొద్దిరోజులు నెట్టుకొచ్చినా జరుగుతున్న పరిస్థితులు ఆమెని మరింత వెంటాడాయి. రెండువారాలుగా ఒంటరితనం మరింత కుంగదీసింది. ఈ విషయాన్ని బంధువులు, ఫ్రెండ్స్‌తో పదే పదే చెబుతూ బాధపడేది. చివవరకు తనతోపాటు ఇద్దరు పిల్లలు కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ALSO READ: ఛీ.. ఛీ.. వాడొక కామాంధుడు.. ఆ వీడియో ఎంత పని చేసింది

ఈ కేసులో విజయరెడ్డి చివరిగా మాట్లాడిన వారి ఫోన్‌కాల్స్ వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఇద్దరు టెక్కీలు ఆమెతో చాటింగ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరినీ పిలిపించి విచారణ చేశారు. ఆమె కుటుంబంలో విభేదాలు, ఆస్తి తగాదాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. దుబాయ్‌ నుంచి భర్త వచ్చిన తర్వాత బీబీనగర్‌లో వారి అంత్యక్రియలు జరిగాయి.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×